బోగాపురం రియల్ ఎస్టేట్ అమరావతి కన్నా సూపర్ ఫాస్ట్ !

భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం శరవేగంగా నిర్మాణం అవుతోంది. ఇప్పటికే నలభై శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో మొదటి విమానం దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఏరియా అంతా ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. అందుకే ఇప్పుడే చాలా మంది ముందస్తుగా అక్కడ ఓ ఇంటి స్థలం కొనేస్తున్నారు. అవకాశం ఉన్న వారంతా అదే పనిలో ఉండటంతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది.

బోగాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్ లో విపరీతంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. పెద్దగా రోడ్డు సౌకర్యం లేకపోయినా ..సరే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎయిర్ పోర్టు ఆపరేషన్ ప్రారంభమైతే… అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అంతకు మించి లగ్జరీ లైఫ్ కోసం బడా నిర్మాణ సంస్థలు సౌకర్యాలు కల్పించేందుకు పరుగులు పెడతాయి. ఇది జరగడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు. నాలుగైదేళ్ల కాలంలోనే బోగాపురం చుట్టుపక్కల శంషాబాద్ తరహాలో సిటీ ఏర్పడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ప్రస్తుతానికి బోగాపురంలో బడా నిర్మాణ సంస్థలు కూడా పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశాయి. గ్రామాల్లో చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న చిన్న వెంటర్లు వేస్తున్నారు. 150 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. గజం ధర ఐదు నుంచి ముఫ్పై వేల వరకూ దూరాన్ని బట్టి నిర్ణయిస్తున్నాయి. అయితే ఎక్కువగా గ్రామ పంచాయతీ అనుమతులు ఉండటమో.. అసలు అనుమతులు లేకపోవడమో జరుగుతున్నాయి. ఇలాంటి వాటి పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.

ఇప్పుడు అనుమతులు ఇవ్వడం లేదని.. ముందు ముందు అనుమతుల బాధ్యత తామే తీసుకుంటామని కొంత మంది భరోసా ఇస్తూంటారు. కానీ ఒక్క సారి డబ్బులు అందిన తర్వాత ఎవరూ బాధ్యత తీసుకోరు. ప్రస్తుతం అమరావతిలో ప్లాట్ల కన్నా.. బోగాపురం ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. అయితే పెట్టే పెట్టుబడికి తగ్గట్లుగా సురక్షితమైన వాటి విషయంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close