తాజా సమాచారం ప్రకారం వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వైకాపాలోనే కొనసాగేందుకు నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. వైకాపా ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆయనను బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ ఇద్దరూ కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడిన తరువాత ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎల్లప్పుడూ ఆయనకీ తగిన ప్రాధాన్యత, గౌరవమే ఇచ్చేమని ఇక ముందు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో భూమానాగిరెడ్డి మెత్తబడినట్లు సమాచారం. విజయమ్మ భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియతో కూడా మాట్లాడినట్లు సమాచారం. భూమానాగిరెడ్డి పార్టీ మారబోవడం లేదని పార్టీలో నేతలు చెపుతున్నారు కానీ ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆ విషయం చెప్పవలసి ఉంది.