నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిన తరవాత కొంత కాలం టీటీడీ చైర్మన్ గా పని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన హడావుడి చాలా ఎక్కువ. ఆయన కొండపైకి వెళ్లి తాము తప్పు చేసి ఉంటే… తాను తన కుటుంబం నాశనమైపోవాలని శపథం కూడా చేసి వచ్చారు. బయటకు వస్తున్న వివరాలతో.. అసలు నెయ్యి కల్తీ అంతా భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతోందని తేలుతోంది.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉన్న నెయ్యి సప్లయర్ ను.. భూమన టీటీడీ చైర్మన్ అయ్యాక మార్చేశారు. టెండర్ రూల్స్ కూడా మార్చేసి.. ఏఆర్ డెయిరీతో ఒప్పందం చేసుకనేలా చేశారు. ఇందు కోసం రివర్స్ టెండరింగ్ లో భారీగా తగ్గింపు ఇప్పించారు. ఆయన ఎఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేయడం లేదు. అంత ఎక్కువ నెయ్యి సంస్థ దగ్గర లేదు. ఎక్కడెక్కడి నుంచి తీసుకుని తన పేరు మీద పంపిస్తోంది. భూమనతో ఒప్పందం చేసుకున్నకంపెనీలు నెయ్యిని ఏఆర్ డెయిరీకి పంపిస్తే..వారు తమ పేరుతో తిరుమలకు పంపుతున్నారు.
ఇక్కడ పెద్ద ఎత్తున కల్తీతో పాటు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తులో ఇలాంటి విషయాలు చాలా వరకూ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తేలుకుట్టిన దొంగలాగా.. భూమున హడావుడి చేయడానికి కారణం తాను దొరికిపోతాననన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా భూమన.. ఇంకెన్నివేషాలేసినా..ఆయన దొరకిపోవడం ఖాయమన్న సంకేతాలు గట్టిగా వస్తున్నాయి.