భూమా, ప్రవీణ్ రావు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులా మారిన భూవివాదం అనేకానేక మలుపులు తిరుగుతోంది. ప్రవీణ్ రావు కుటుంబంసభ్యలను కిడ్నాప్ చేయడంంతో.. ఆ వ్యవహారం అఖిలప్రియ మెడకు చుట్టుకుంది. వారిని కిడ్నాప్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారు..? ఎలా ఎగ్జిక్యూట్ చేశారు..? ఇవన్నీ ఎప్పటికప్పుడు హైలెట్ అవుతున్నాయి. అదే సమయంలో ఆభూమి గురించి.. కూడా చర్చ జరుగుతోంది. ్యితే ఇప్పటి వరకూ ఆ భూమి ఎంత విలువైనది అన్నదానిపైనే ఎక్కువ మంది దృష్టి కేంద్రీకరించారు. ఆ భూమి..ఇప్పటికీ ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
హఫీజ్ పేటలో ఉన్న అత్యంత విలువైన భూమి “పాయిగా” భూములు. అంటే.. నిజాం కాలంలో ఇదో ఒక సైనిక జాగీరు. పాయిగా ను గుర్రాల నిర్వహణ కోసం భూములను నిజాం నుంచి పొందారు. తర్వాత కాలంలో ఈ భూములను పాయిగా జాగీరుగా మార్చారు. చట్టం ప్రకారం.. పాయిగా- జాగీరు- సంస్థానాలు- మక్తా- గ్రామ అగ్రహారం-ఉహ్మ్లి- ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. అందుకే ధరణి పోర్టల్లో ఇప్పటికి హాఫీజ్ పేట భూములు.. ప్రభుత్వం పేరుపైనే ఉన్నాయని చెబుతున్నారు.
అయితే యాజమాన్య హక్కులులేకుండా ఎవరు అమ్మారో.. ఎవరు కొన్నారో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పుడు ఆ భూమి తమదంటే తమదని రెండు వర్గాలు పరస్పరం చెబుతున్నారు. ప్రభుత్వం కానీ..పోలీసులు కానీ ఆ భూమి యజమాన్య హక్కుల గురించి చెప్పడం లేదు. అలా చెబితే.. ఆ భూమిని కొన్నామని చెబుతున్న ప్రవీణ్ రావు సోదరులు కూడా.. ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఆ భూమి ప్రభుత్వానిదా కాదా… ఒకవేళ ప్రభుత్వానిదే అయితే.. దానిపై లావాదేవీలు ఎలా జరిగాయన్నదాన్ని బయట పెడితే… వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. కొసమెరుపేమిటంటే.. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. అయినా లావాదేవీలు.. సెటిల్మెంట్లు నడుస్తూనే ఉన్నాయి.