కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయిన భూమన కరుణాకర్ రెడ్డి .. తొక్కిసలాట ఘటనతో దాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవుడిపైనే నిందలేస్తున్నారు. కల్తీ నెయ్యి అంటూ రాజకీయం చేశారని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ప్రెస్‌మీట్ పెట్టి శవాలపై రాజకీయం ప్రారంభించేశారు. ఇక్కడా ఆయన తెలివి మాత్రం ఏ మాత్రం తక్కువ పడలేదు. తాను ఇరుక్కుపోయిన నెయ్యి ఇష్యూనే వాడుకున్నారు.
నెయ్యి కల్తీ చేశారని ఆరోపణలు చేశారు కాబట్టే దేవుడు ఆగ్రహం చెంది ఇలాంటివి చేయిస్తున్నాడన్నట్లుగా భూమన చెబుతున్నారు. దేవుడి ఎక్కడైనా భక్తుల్ని చంపుకోవాలని అనుకుంటాడా? . దేవుడంటే ఏ మాత్రం నమ్మకం లేని.. భూమన గతంలో శ్రీవారి ఆలయంపై, ముూల విరాట్‌పై ఎన్నో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. తనకుటుంబంలోని వారికి క్రిస్టియన్స్ తో పెళ్లి పోయించారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుడ్ని నిందించడానికి వెనుకాడటం లేదు.
టీటీడీ చైర్మన్ గా చివరి రోజుల్లో అవకాశం దక్కించుకుని పెద్ద ఎత్తున టీటీడీ నిధుల్ని కుమారుడి విజయం కోసం మళ్లించారు. నెయ్యి కల్తీ చేసి చేయాల్సిన తప్పిదం అంతా చేయించారు. వైష్ణవిడైరీ, తమిళనాడు డైరీ పేరుతో అంతా కల్తీ నెయ్యి సరఫరా చేసింది భూమన కరుణాకర్ రెడ్డేనని తిరుపతి అంతా తెలుసు. అయినా ఈ తొక్కిసలాట ఘటనను అడ్డం పెట్టుకుని తాను చేసిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి శవరాజకీయంతో తెర ముందుకు వచ్చేశారు.