తిరుమలలో వైసీపీ బలపడేందుకు కొత్త దారులు వెతుక్కుంటుంది. లడ్డూ వ్యవహారంలో దెబ్బతిన్న క్రెడిటబులిటిని తిరిగి పొందేందుకు భూమన కరుణాకర్ రెడ్డి భక్త రాజకీయం మొదలు పెట్టారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృతి చెందాయని, ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.
గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. ఆరోపణలు చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతి అనేది సెన్సిటివ్ అంశం. ఇదే నిజమైతే హిందువులు వీటిని సహించరు.అలాగే, టీడీపీ నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ , జనసేన పార్టీలు కూడా ఉన్నాయి. గోవులు మృతి చెందితే చూసి చూడనట్టు వదిలేస్తారా? కనీసం పది ఆవులు చనిపోగానే చర్యలు చేపట్టారా? అని భూమన ఆరోపణలతో ప్రజల్లో అనుమానం రాక మానదు.
ఈ నేపథ్యంలోనే భూమన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. భూమన డేట్ , టైం చెప్పాలని , గోశాలకు వచ్చి రికార్డులను పరిశీలించాలని, ఆయన చెప్పింది అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా ? అని సవాల్ విసిరారు. భూమనకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని భాను ప్రకాష్ రెడ్డి చాలెంజ్ చేశారు. ఈ సవాల్ కు భూమన స్పందిస్తారా? చూడాలి. తిరుమలలో బలపడేందుకు మత సంబంధిత రాజకీయమే వైసీపీ చేయనుందని, తాజా రాజకీయంతో బలం చేకూరుతుందని అంటున్నారు. మరి, జనం విశ్వసిస్తారా అన్నది పాయింట్