కొడుకుకు రాజకీయ భవిష్యత్ కల్పించడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓ రకంగా యజ్ఞం చేస్తున్నారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుని తమ కుమారుడికి సీటు ఇప్పించుకున్నారు. కానీ కుమారుడ్ని ఎలా ప్రజల ముందు లీడర్ గా నిరూపించాలో అర్థం కావడం లేదు. అందుకే ఆయన టీటీడీ సొమ్మును ఆయుధంగా వాడుకుని ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వం పైసా కూడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో తిరుపతిలో పనులకు శ్రీవారి నిధులు వాడుతున్నారు. అందుకోసమే టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంది. కోర్టుల్లో కేసులు పడిన ఆగడం లేదు. తాజాగా తిరుపతి పుట్టిన రోజు వేడుకలంటూ పార్టీ కార్యక్రమంలా ఓ వేడుక నిర్వహించారు. ఇది కూడా టీటీడీ నిధులతోనే. ప్రతీ ఏటా నిర్వహిస్తామని చెబుతున్నారు. అంతేనా.. తిరుపతి పరిధిలో నివాసం ఉంటే.. టీటీడీ పర్మినెంట్ కాని ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఎడెనిమిది వేల మంది వరకూ ఉంటారు. ఇదంతా వారి ఓట్ల కోసమే .
దేవుడిని వాడుకుని రాజకీయాలు చేస్తే ఫలితాలుఎంత భయంకరంగా ఉంటాయో గతంలో అనేక ఘటనలు నిరూపితమయ్యాయి. అయినా భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం…తన కుమారుడి కోసం దేనికైనా తెగబడుతున్నారు. ఆయనతీరు చూసి టీటీడీలోని అనేక మంది నోరెళ్లబెడుతున్నారు. శ్రీవారి సొమ్ములను ఇంత అప్పనంగా రాజకీయం కోసం ఖర్చు చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.