వైసీపీ నేతల వ్యవహారం తేలు కుట్టిన దొంగల్లా ఉంటుంది. తిరుపతిలోని అలిపిరిలో నిర్మాణం అవుతున్న ముంతాజ్ హోటల్ విషయంలో ఇదే జరుగుతోంది. ముంతాజ్ హోటల్ అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. సాధువుల పోరాటానికి భయపడి అనుమతులు రద్దు చేశారన్నారు. సాధువల కోసం తాను ముందుంటానని చెప్పుకొచ్చారు.
కానీ టీడీపీ హయాంలో అలిపిరిలో దేవలోకం అనే ప్రాజెక్టును చేపట్టారు. దేశంలోని ప్రసిద్ధ ఆలయాల నమూనాలను పెట్టి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మంచి అనుభూతి కల్పించాలనుకున్నారు. జగన్ సీఎం అవగానే ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారు. ముంతాజ్ హోటల్ కు ఇరవై ఎకరాలు ఇచ్చారు. అక్కడ సెవన్ స్టార్ హోటల్ కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. అప్పుడంతా ఈ భూమన తిరుపతి ఎమ్మెల్యే..తర్వాత టీటీడీ చైర్మన్ కూడా అయ్యారు. కానీ ఆ హోటల్ వద్దని ఒక్క మాట కూడా అనలేదు.
టీడీడీ అధికారంలోకి రాగానే .. టీటీడీ బోర్డు ఏర్బాటు చేయగానే మొదటి తీర్మానం ఆ హోటల్ మీదనే చేశారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇప్పుడు రద్దు చేసింది. జగన్ చేసిన నిర్ణయాన్ని తప్పు పట్టి రద్దు చేయిస్తే మా పోరాటం అని భూమన చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడకుండా ముందుకు రావడం చూసి వైసీపీ కార్యకర్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. జగన్ తప్పు చేస్తే అప్పుడెందుకు మాట్లాడలేదు.. ఇప్పుడు మంచి పని చేశారంటే..జగన్ తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా అని అంటున్నారు. అయితే భూమన మాత్రం..ప్రజలకు ఇవన్నీ తెలియవని అనుకుంటారు.