తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో రాజలింగ మూర్తి అనే వ్యక్తి హత్య రాజకీయంగా దుమారం రేపింది. ఆయన భార్య గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు కొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పి ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అసలు దీనంటికి కారణం.. ఆ రాజలింగమూర్తి మేడిగడ్డ అక్రమాలపై భూపాలపల్లి కోర్టులో పిటిషన్లు వేయడం. ఆ కేసులో నేరుగా హాజరు కావాలని కేసీఆర్, హరీష్ లకు నోటీసులు వచ్చాయి.
ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో రాజకీయం రాజుకుంది. గండ్ర వెంకటరమణారెడ్డినే చేయించారని.. ఆయన వెనుక బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం అలాంటి రాజకీయం ఏదీ రాజలింగ మూర్తి హత్యలో లేదని ప్రకటించారు. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. హత్యలో 10 మంది పాత్ర ఉందని.. A1 రేణికుంట్ల సంజీవ్, A4 హత్యలో పాల్గొన్నారని పోలీసులు ప్రకటించారు. నిందితులు అయిన పది మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఎకరం స్థలం కోసం రేణుకుంట్ల ఫ్యామిలీతో రాజలింగంకు తగాదా ఉందని.. అందుకే స్కెచ్ వేసి రాజలింగమూర్తిని హత్య చేశారని పోలీసులు తేల్చారు. దీంతో భూ వివాదంలోనే ఆయన హత్యకు గురయ్యారని స్పష్టమయింది. మంత్రి స్వయంగా రాజకీయం ఉందని.. గండ్ర చేయించాలని ఆరోపించినా.. పోలీసులు మాత్రం దర్యాప్తులో తేలిన విషయాన్ని నిర్మోహమాటంగా ప్రకటించారు. దీంతో తెలంగాణలో హత్యా రాజకీయం జరగలేదని తేలిపోయింది.