న్లీ స్టార్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ ఇప్పుడు మరో సాహసం చేస్తున్నాడు. ఆల్రెడీ మనోడు సాహసం సినిమా చేశాడుగా మరో సాహసం ఏంటి అంటే ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా బడ్జెట్ తో సాహసం చేస్తున్నాడు గోపిచంద్. ఓ హీరోకి ఓ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ ను బట్టే సినిమాలు వాటి రిజల్ట్ ఉంటాయి. అయితే గోపిచంద్ మాత్రం మినిమం గ్యారెంటీ హీరో అయినా పెద్ద బడ్జెట్ అంటే కాస్త కష్టమే అనాలి.
ఇక ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా ఆక్సీజన్ కు 30కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారట దర్శక నిర్మాతలు. ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కొడుకు మీద ప్రేమతోనో లేక గోపిచంద్ మీద నమ్మకంతోనో తెలియదు కాని ఆక్సీజన్ సినిమా బడ్జెట్ అక్షరాలా 30 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మరి గోపి స్టామినా ప్రస్తుతం ఉన్న ఫ్లాపులు చూసి కూడా అంత బడ్జెట్ ఎలా పెడుతున్నారు అంటే సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం అంటున్నారట. మరి నిర్మాతగా అటు సూపర్ హిట్స్, ఇటు సూపర్ ఫ్లాప్స్ ఫేస్ చేసిన రత్నం ఈ సినిమాను ఎలా ప్రేక్షకులకు చేరవేస్తాడో చూడాలి.