ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్ సుజాతతోపాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడారు.నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
ఇటీవలే కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా తాజాగా మరో 12 మంది సైకిల్ ఎక్కడంతో ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ టీడీపీ వశమైంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కాగా, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ గెలుపొందారు. అయితే, ఒంగోలులో వైసీపీ నేతలను బాలినేని పట్టించుకోకపోవడం, ఆయన కూడా వైసీపీని వీడెందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడంతో..ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ టీడీపీ వశమైంది.