యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ సీజన్1కి 16.2 టిఆర్పి రేటింగ్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్’ సీజన్2 టిఆర్పి రేటింగ్‌తో మొదలైంది. తొలి సీజన్‌తో పోలిస్తే రేటింగ్ తగ్గిందని అందరూ అనుకుంటున్నారు. ‘స్టార్ మా’ సౌతిండియన్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాత్రం ‘బిగ్‌బాస్2’ ప్రారంభ రేటింగ్ చాలా ప్రోత్సాహకరమైనదిగా భావించాలని చెబుతున్నారు. “సీజన్1 టెలికాస్ట్ టైమ్ ప్రతిరోజూ రెండు గంటలు అయితే సీజన్2 టెలికాస్ట్ టైమ్ రెండున్నర గంటలు. అరగంట టెలికాస్ట్ టైమ్ పెరిగింది. రేటింగ్ కాస్త తగ్గింది. అందువల్ల ప్రేక్షకాదరణలో పెద్ద మార్పు లేదు” అని అలోక్ జైన్ తెలిపారు.
‘బిగ్‌బాస్2’ రేటింగ్ తగ్గితే తగ్గింది కానీ… ‘స్టార్ మా’ యాజమాన్యానికి లాభాల పంట పండిస్తోంది. దీనికి ప్రముఖ కంపెనీలైన ఒప్పో, అమెజాన్, డాబర్, గుడ్‌నైట్ స్పాన్సర్లుగా వున్నాయి. ఆల్రెడీ హిట్టయిన సీజన్ కావడంతో బ్రాండ్లు బాగా వచ్చినట్టున్నాయి. దాంతో లాభం పెరిగింది. అంకెల్లో ఎంత లాభం పెరిగిందో చెప్పలేదు కానీ… తొలి సీజన్‌తో పోలిస్తే నాలుగురెట్లు పెరిగిందని అలోక్ జైన్ తెలిపారు. “బిగ్‌బాస్1తో పోల్చితే ‘బిగ్‌బాస్2’ షో మీద మేం చేసిన ఖర్చు, రాబడి నాలుగురెట్లు పెరిగాయి. స్పాన్సర్ల ఆదాయం రెండింతలు పెరిగింది” అని ఆయన పేర్కొన్నారు. అదండీ సంగతి. మొదటి వారంతో పోలిస్తే తర్వాత వారంలో నాని యాంకరింగ్ మెరుగైంది. షోకి ఆదరణ పెరుగుతోంది. సో… లాభాలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.