బిగ్ బాస్ 2 విన్నర్‌గా నిలిచిన కౌశల్ పాపులారిటీ మామూలుగా లేదు. అసలు బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరకముందే కౌశల్‌ని ఫ్యాన్స్ అసోసియేషన్లు మొదలైపోయాయి. అక్కడితో ఆగిందా? కౌశల్ ఆర్మీ అంటూ.. ఓ గ్యాంగ్ బయలుదేరింది. కౌశల్ గెలుపులో ఈ ఆర్మీదే కీలకస్థానం. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. మీడియా మొత్తం కౌశల్‌ని హీరోలా చూసింది. కొన్ని సినిమా ఆఫర్లు కూడా అందాయి. ఈలోగా.. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు, రిబ్బన్ కటింగులకు కౌశల్ ని అతిథిగా పిలవడం మొదలెట్టారు. ఇదంతా కౌశల్ బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఓ దశలో.. షాపింగ్ మాల్ ప్రారంభించడానికి పిలిస్తే.. `పాతిక లక్షలు` అడిగాడట. దాంతో..నిర్వాహకులు కంగారు పడి కాల్ కట్ చేశారని తెలుస్తోంది. సాధారణంగా… రకుల్, రాశీఖన్నా లాంటి వాళ్లు రూ.5 లక్షలకే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి వస్తుంటారు. అలాంటిది కౌశల్ ఏకంగా రూ.25 లక్షలు అడిగేసరికి కంగారు పడకుండా ఎలా ఉంటారు?? ఈ సీజన్లో కేవలం ఇలాంటి కార్యక్రమాల ద్వారానే కౌశల్ రూ.50 లక్షల వరకూ వెనకేసుకున్నాడని సమాచారం. సినిమాల ద్వారా.. మరింత ఆదాయం రానుంది. టీవీ సీరియళ్లలో కౌశల్ బాగా పాపులర్. ఇప్పుడు అతనికి మరింత డిమాండ్ ఎక్కువైంది. మొత్తానికి బిగ్ బాస్ క్రేజ్‌ని కౌశల్ బాగానే వాడుకున్నాడనిపిస్తోంది.