కరోనా ప్రభావం బిగ్ బాస్ పైనా పడిందా? బిగ్ బాస్ 4 సీజన్లో కొత్త మార్పులు రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి ఇన్సైడ్ వర్గాలు. తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. తొలి మూడు సెషన్లూ హిట్టే. నాలుగో సెషన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రెటీల ఫైనల్ లిస్టు తయారైందట. ఇది వరకు ఈ గేమ్ షోలో 16 నుంచి 18 కంటెస్టెంట్లు ఉండేవారు. ఇప్పుడు 12 మందితోనే ఈ షో.. నడిపిస్తారని సమాచారం. బిగ్ బాస్ 3 సీజన్ 100 రోజుల వరకూ సుదీర్ఘంగా సాగింది. అయితే ఈసారి 50 రోజులకే పరిమితం చేస్తారని సమాచారం. బిగ్ బాస్ గేమ్ షోలో.. టాస్క్‌ల విషయంలోనూ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇది వరకు సభ్యుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి టాస్కులు ఇచ్చేవారు. ఇప్పుడు కరోనా టైమ్ కదా. సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా కీలకం. అందుకే…. అలాంటి టాస్క్‌లను పూర్తిగా పక్కన పెట్టార్ట. ఇది వరకెప్పుడో బిగ్ బాస్ సెట్ పనిని పూర్తి చేశారు. అయితే.. ఇప్పుడు సెట్లో కొన్ని కీలకమైన మార్పులూ చేర్పులూ చేశారని తెలుస్తోంది. సామాజిక దూరం పాటించేలా పడక సెట్టప్పులూ, ఒకొక్కరికీ ఒక్కో స్నానాల గది, వాషింగ్‌మిషన్ ఉండేలా మార్పులు చేశారని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ 4 షో… సరికొత్తగా దర్శనమివ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకొంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడమే తరువాయి.