కౌశల్ VS బాబు గోగినేని..
బిగ్ బాస్ షో లో హైలెట్ ఫైట్ వీళ్ళ మధ్యే. కౌశల్ దూకుడికీ, గోగినేని లాజిక్కులకి మధ్య రసవత్తరమైన పోరు నడిచింది. “నేనే బిగ్గర్ బాస్” అని గోగినేని తనకి తాను ప్రకటించుకోవడం, అశోక చక్రం ఎపిసోడ్.. బిగ్ బాస్ షో ఫాలో ఐన వాళ్లకు తెలిసిన విషయాలే. వాటితోనే గోగినేని, కౌశల్ మధ్య ఈ ‘డ్రామా’ మొదలయ్యింది. కౌశల్ ఆర్మి అనే ఓ గ్రూప్ ఎప్పుడైతే ఏర్పడిందో, అప్పటినుంచి సోషల్ మీడియాలో మాటల యుద్ధం మరింత ఎక్కువయ్యింది. బాబు గోగినేని మద్దతుదారులు, కౌశల్ ఆర్మి.. ఒకరి పై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు. బిగ్ బాస్ షో ముగిసినా.. వీరిద్దరి మధ్య గొడవ ఇంకా రగులుతూనే ఉంది.
షో లో కౌశల్ విజేతగా నిలిచాడు. బయటికి రాగానే మీడియా కి ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. దాదాపు ప్రతిసారి గోగినేని పై సెటైర్లు వేశాడు. ఇంటర్నేషనల్ ఫిగర్ అని చెప్పుకునే గోగినేనికి అశోక చక్రం లో ఎన్ని గీతలు ఉంటాయో కూడా తెలియదని ఎద్దేవా చేసాడు. గోగినేని కూడా ఏం తక్కువ తినలేదు. పెంగ్విన్ లు పాలు యిస్తాయని కౌశల్ చెప్పిన సంగతి గుర్తు చేసి ఆడేసుకున్నాడు. కౌశల్ ని కొన్ని సంఘాలు పిలిచి సన్మానాలు చేయడం మొదలెట్టాయి. అక్కడా ఇదే గొడవ. ఈ కార్యక్రమం సంక్రాంతి సీజన్ లో కూడా సాగింది. తాజాగా ఓ ఫంక్షన్ లో కౌశల్, బాబు మళ్ళీ మాటల యుద్ధం నడిపారు. బిగ్ బాస్ షో లో జరిగిన విషయాలని, తెరపై క్లిప్పింగులు వేసుకుని గుర్తు చేసుకుంటూ… పాత గోడవలని మళ్ళీ కెలుక్కున్నారు. పెద్ద పెద్ద గొంతుకలతో అరచుకున్నారు. వేదికపై ఉన్న నిర్వాహకులు కూడా వాళ్ళని ఆపకుండా మిన్నకుండిపోయారు. వీరిద్దరి తీరు చూస్తుంటే.. షో లో జరిగిన విషయాలని మరీ వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అర్ధమైపోతోంది. షో ఐపోయింది.. జనం కూడా ఆ మూడ్ నుంచి ఎప్పుడో బయటికి వొచ్చేశారు. వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఎలా ఇంకెంత కాలమో..?!