కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంట్రీసాంగ్లతో, ఇంట్రడ్యూస్లతో మొదటి ఎపిసోడ్ అదిరిపోయింది. ఇక సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజు గడిపిన 15 మంది కంటెంస్టెంట్స్ను బిగ్ బాస్ టాస్క్‌లతో కాస్త ఇబ్బందిపెట్టారు. కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చీ రాగానే గేమ్‌లో సీరియస్‌నెస్ తీసుకొచ్చారు బిగ్ బాస్.
షోలో చివరగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితికాలను ప్రశ్నలడగడంతో ఎపిసోడ్ 2 స్టార్ట్ అవుతుంది. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను రవికృష్ణ, శివ జ్యోతి, అషూరెడ్డి కంప్లీట్ చేశారు. బిగ్ బాస్ ఇంట్లోకి సభ్యులందరికీ స్వాగతం అంటూ బిగ్ బాస్ సభ్యులకు ఆహ్వానం పలుకుతారు. ఈ ఇంటిని మీకు కానుకగా ఇస్తానున్నాని సభ్యులకు చెబుతారు బిగ్ బాస్. హౌస్‌లో ఎలా ప్రవర్తించాలో బిగ్ బాస్ సభ్యులకు క్లుప్తంగా వివరించారు. హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి ముగ్గురు సభ్యులైన శివ జ్యోతి, రవికృష్ణ, అషూరెడ్డిలకు ఇచ్చిన టాస్క్‌ను గుర్తు చేశారు బిగ్ బాస్.
హౌస్‌లో మిగిలిన 12 మంది ఇంటిసభ్యుల్లో చివరి 6 స్థానాల్లో నిలిచి ఆ ఆరుగురు సభ్యులు ఎవరో బిగ్ బాస్ కు ఆ ముగ్గురు వెంటనే చెప్పాలని ఆదేశిస్తారు బిగ్ బాస్. దీంతో ఆ ముగ్గురు చర్చించుకుని రాహుల్, వరుణ్, వితికా, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్‌ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు. ఇక ఆ ఆరుగుర్ని నామినేట్ అయినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు.
ఇలా నామినేట్ కావడంపై ఆ ఆరుగురు చర్చించుకుంటూ హౌస్‌లో గడిపారు. ప్రధానంగా వచ్చీరాగానే చేసిన ఈ నామినేషన్స్ ఎందుకోసమనే డిస్కషన్ సాగింది. ఇక మరుసటి రోజు ఉదయం బాబా భాస్కర్, జాఫర్ యోగా చేస్తూ వ్యూవర్స్‌కు ఫుల్ కామెడీ అందించారు. బాబా భాస్కర్ తాను గురువునంటూ తాను చెప్పినట్లుగా వినాలంటూ ఫన్నీగా జాఫర్‌తో మాట్లాడే మాటలు నవ్వులు తెప్పిస్తాయి.
మొదటిరోజు ఉదయం పదిగంటలకు ‘‘లేడిస్ అండ్ జెంటిల్మన్ అంటూ.. చేతి గీత మారిపోయే ఇవ్వాలే ఇలా’’ అనే పాటను బిగ్‌బాస్ ప్లే చేయగా ఇంటి సభ్యులంతా ఆనందంగా డ్యాన్స్‌లతో అదరగొట్టారు. తర్వాత ఇంటి అవసరాలకు సరుకులను బిగ్‌బాస్ పంపించాడు. సాయంత్రం వరుణ్, వితికా, శ్రీముఖి, మహేశ్‌తో పాటు కొందరు సభ్యులు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. వరుణ్ తన భార్య వితికను ఎత్తి స్విమ్మింగ్ ఫూల్లో పడేశారు. శ్రీముఖి స్విమ్మింగ్ ఫూల్లోకి మెల్లగా దిగటంతో ఆమెపై నీళ్లు చల్లి రచ్చరచ్చ చేశారు.
సాయంత్రం 5:30 గంటలకు హేమను కన్ఫెక్షన్ రూమ్‌కు పిలిచి బిగ్ బాస్ ఒక సందేశాన్ని పంపారు. ఇంట్లో సభ్యులంతా కలిసిమెలసి ఉండాలని, ఒకరి పనుల్లో మరొకరు సాయపడాలనేది ఆ సందేశం. ఇక నామినేషన్ ప్రక్రియలో ఉన్న ఆరుగురికి కాస్త ఉపశమనం కలిగించేలా బిగ్ బాస్ ఒక అవకాశం కల్పించాడు. నామినేట్ అయిన ఆరుగురు కలిసి మిగిలిన సభ్యుల నుంచి ఒక మానిటర్‌ను ఎన్నుకోవాలని సూచించాడు. దీంతో ఆ ఆరుగురు కలిసి హేమను మానిటర్‌గా ఎన్నుకున్నారు.
నామినేట్ అయిన ఒక సభ్యుల్లో నుంచి ఒక్కొక్కరు చొప్పున మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒక్కొక్కరిని తమకు బదులుగా ఎన్నుకోవచ్చని బిగ్ బాస్ నామినేట్ అయిన వారికి సూచించారు. అయితే సరైన కారణాలను చెబితేనే రీప్లేస్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో తుది నిర్ణయం మాత్రం మానిటర్‌దేనని బిగ్‌బాస్ చెప్పారు.
హౌస్‌లో బెల్ మోగిన ప్రతిసారి నామినేట్ అయిన ఆరుగురిల్లోంచి ఒకరు మిగిలిన ఇంటి సభ్యుల నుంచి ఒకరిని ఎన్నుకుని సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయవచ్చని బిగ్ బాస్ సూచించారు. ఈ విధానంలో నామినేట్ అవుతున్న సభ్యులు కూడా వారు అభిప్రాయాలు చెప్పవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం మానిటర్దే.
ఇలా హౌస్‌లో మొదటి రోజే సభ్యుల మధ్య ఒక పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. దీంతో సభ్యుల మధ్య చిచ్చు మొదలైంది. నామినేట్ అయిన ఆరుగురు ఒక గ్రూప్‌గా ఏర్పడి మిగిలిన ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలని వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ ఆరుగురిలో మొదట నామినేషన్ నుంచి జాఫర్ తప్పించుకోనున్నారు. నామినేట్ అయిన సభ్యులు జాఫర్ మొదటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వీలు కల్పించారు. మరి జాఫర్ ప్లేస్‌లో కొత్తగా నామినేట్ అయ్యేదెవరో రెండోరోజు తెలియనుంది.
ఈ మొదటి టాస్క్‌తోనే మొత్తానికి ఇంటి సభ్యుల మధ్య చిచ్చు మొదలైంది. ఇక మానిటర్‌గా వ్యవహరిస్తున్న హేమకు ఎన్ని ఇబ్బందులురానున్నాయో వేచి చూడాల్సిందే. హేమ తన టాస్క్‌ని బాధ్యతగా నిర్వర్తిస్తానని ఆడియన్స్ తనను తిట్టుకోవద్దు అంటూ కెమెరా వద్దకు వెళ్లి మాట్లాడుతుంటే బాబా భాస్కర్ సైలెంట్‌గా వింటూ హేమను ఆటపట్టించడం నవ్వుతెప్పిస్తోంది. ఇక మంగళవారం, జూన్ 23,2019న ప్రసారమయ్యే ఎపిసోడ్ ఆసక్తిగానే ఉండనుంది. బిగ్ బాస్ హౌస్‌లో గొడవ స్టార్ట్ కానుంది.
https://www.youtube.com/watch?v=DiiXg96U0YQ