తెలుగులో పాపులర్ రియారిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు జరిగాయి. కరోనా సమయంలోనూ.. నాలుగో సీజన్ ని విజయవంతంగా నడిపించారు నిర్వాహకులు. అయితే.. ఆ సీజన్ సమయంలో మరోవైపు ఐపీఎల్ సాగడంతో.. బిగ్ బాస్ రేటింగులకు గండి పడింది. యువతరం ఐపీఎల్ మోజులో పడిపోవడంతో, రేటింగులు తగ్గాయి. అయితే ఈసారి ఆ ప్రమాదం లేకుండా `మా` జాగ్రత్త పడుతోంది. ఐపీఎల్ పూర్తయ్యాకే బిగ్ బాస్ ని మొదలెట్టాలనుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ మొదలవుతుంది. మే వరకూ మ్యాచ్‌లు సాగుతాయి. అందుకే… బిగ్ బాస్‌ని జూన్ – జులైలలో పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఇప్పటికే 30 మంది సెలబ్రెటీలతో ఓ లిస్టుని తయారు చేసిందని, దాన్ని 16కు కుదించే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ సీజన్‌కీ… నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారు.