డిసెంబరు 20న ‘ప్రతిరోజూ పండగే’ వచ్చేస్తోంది. ఈలోగా ప్రమోషన్లూ మొదలెట్టేశారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలన్నీ బాగానే మార్మోగుతున్నాయి. ఇప్పుడు ‘తకిట తకిట’ అనే పాటని రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వదులుతున్నారు. ఈ పాట పాడింది బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్. సోషల్ మీడియాలో రాహుల్ కి బాగా క్రేజ్ పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ‘తకిట తకిట’ ప్రమోషనల్ గీతాన్ని రాహుల్‌పైనే పిక్చరైజ్ చేశారు. సినిమాలో స్టెప్పులేసిన సాయిధరమ్, రాశీఖన్నా బిట్లనూ ఈ పాటలో కలిపారు. ఇదో ఫ్యామిలీ సాంగ్. సాధారణంగా ఇలాంటి పాటలు మెలోడీ భరితంగా సాగుతాయి. కానీ.. తమన్ మాత్రం సరికొత్తగా ఆలోచించి ఫాస్ట్ బీట్ తో హుషారైన పాటని కంపోజ్ చేశారు. తేజూ తో పాటు సత్యరాజ్ కూడా స్టెప్పులు వేయడం ఈ వీడియోలో కనిపించనుంది. అల్లు అర్జున్ సినిమా ‘అల వైకుంఠపురం’ కొత్త తరహా ప్రమోషన్లతో దూసుకెళ్తోంది. రిలికల్ వీడియోలకు బదులుగా ఆ పాట కోసమే ప్రత్యేకంగా షూట్ చేసి వదులుతున్నారు. ఈ ఆలోచనని ఇప్పుడు ‘ప్రతి రోజూ పండగే’ కూడా అందిపుచ్చుకుంది.