చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. వాస్తవానికి ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే ‘పోటీ’ అంటారు. అయితే ఈ రెండు సినిమాల పరిస్థితి వేరు. ఈ సినిమాలని నిర్మించింది ఒక్కరే.. ‘మైత్రీ మూవీ మేకర్స్’. ఇలా ఒకే నిర్మాత నిర్మించిన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఎప్పుడూ జరగలేదు.
ఇలా రెండు పెద్ద సినిమాలని ఒకేసారి తీసుకురావడం అంత తేలిక కాదు. ఇద్దరు పెద్ద హీరోలే. వారు కోరుకున్న థియేటర్లు సమానంగా దొరకడం సాధ్యం కాకపోవచ్చు. అలాగే ప్రమోషన్స్ ని కూడా చూసుకోవాలి. ఈ విషయంలో అప్పుడే ‘మైత్రీ మూవీ మేకర్స్’కి నందమూరి ఫ్యాన్స్ నుండి సెగ మొదలైయింది. రేపు వీరయ్య ఫస్ట్ సింగల్ వచ్చేస్తోంది. బాస్ పార్టీ అంటూ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. దీంతో వీరసింహారెడ్డి అప్డేట్స్ ఎక్కడ అంటూ ‘మైత్రీ మూవీ మేకర్స్’పై ఒత్తిడి మొదలైయింది.
ఇక వారసుడు రూపంలో మరో చిక్కుంది. దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు తమిళ సినిమా. దిన్ని తెలుగు డబ్బింగ్ చేసి సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు నిర్మాతల మండలి దిల్ రాజ్ నిర్ణయానికి బ్రేక్ వేస్తూ ఒక ప్రకటన చేసింది. గతంలో దిల్ రాజు మాటల్నే గుర్తు చేస్తూ పండగ పూట డబ్బింగ్ సినిమాలకు చోటులేదని చెప్పింది. ఆ ప్రకటన ప్రకారం జరిగితే ‘మైత్రీ మూవీ మేకర్స్’కి కొంత ఊరట.
అయితే ఇది కాస్త రెండు రాష్ట్రాల చిత్ర పరిశ్రమల మధ్య వివాదంగా మారింది. ”ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు సినిమాలు ఇక్కడ విడుదలౌతున్నాయి. మేము గొప్పగా ఆదరిస్తున్నాం. ఇప్పుడు డబ్బింగ్ పేరుతో వారసుడు ని ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని తమిళ ఇండస్ట్రీ నుండి హెచ్చరికలు వున్నాయి.
అయితే ఈ వివాదంలో ‘మైత్రీ మూవీ మేకర్స్’ వైపు కొందరు వేలు చూపుతున్నారు. ”ఒకే నిర్మాత నిర్మించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడం చరిత్రలో లేదు. ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఎందుకు ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు ?” అని ఎత్తి చూపుతున్నారు.
నిజానికి రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేయడం ‘మైత్రీ మూవీ మేకర్స్’ కీ కష్టమే. కానీ తప్పని పరిస్థితిలో తప్పక విడుదల చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం అయోమయంగా వుంది. మైత్రీకి అన్ని వైపులా నుండి ఒక సవాల్ తో కూడిన వాతావరణమే కనిపిస్తోంది.