జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. తన డిప్యూటీ లను పంపారు. రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో తెలుసు కాబట్టి.. అలాంటి చర్చలు జరగాలన్న ఉద్దేశంతోనే నితీష్ సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. మోదీ ఇప్పటికీ కీలక భాగస్వామిగా ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. .దాన్ని ఆయన చెడగొట్టుకుని రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయే ఉద్దేశంలో ఉన్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికి ఆయన ఎన్ని సార్లు కాంగ్రెస్ తో కలిశారో.. ఎన్ని సార్లు విడిపోయారో లెక్కేలేదు. మరోసారి ఆయన కూటమికి కాదంటే.. అది ఆయన పార్టీకి ఎండ్ కార్డ్ అవుతుంది. బీహార్ లో ఒకప్పుడు మేజర్ పార్టీగా ఉండే జేడీయూ ఇప్పుడు బీజేపీకి మైనర్ భాగస్వామిగా మారింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు మారిపోతే.. బీజేపీ విశ్వరూపం చూపించే అవకాశం ఉంది.
Also Read : నీతి ఆయోగ్ లోనూ చంద్రబాబుకే ప్రియారిటీ!
ఎన్డీఏ కూటమికి ఉండాల్సిన సీట్ల కంటే ముప్ఫై సీట్ల వరకూ ఎక్కువ బలం ఉంది. జేడీయూ సీట్లే కీ కాదు. కానీ ఆయన చేస్తున్న బెట్టు చూస్తూంటే బీజేపీ నేతలకే అసహనం వస్తోంది. బీహార్ కు ప్రత్యేకహోదా పేరుతో నితీష్ రాజకీయం చేస్తున్నారు. బీజేపీని తప్పుగా ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా కుట్రేనని బీజేపీ అనుమానిస్తుంది. నితీష్ రాజకీయానికి విరుగుడు.. బేజీప ప్రారంభిస్తుందని ఢిల్లీ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.