బీహార్ సీఎం నితీష్ కుమార్ కొన్నాళ్లు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతారు.. మరి కొన్నాళ్లు లాలూ ప్రసాద్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరోసారి ఆయన బీహార్ లో తన ప్రభుత్వ భాగస్వామిని మార్చే సన్నాహాల్లో ఉన్నారు. లాలూని వదిలేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికలకు్ ముుందు ఆయన ఇస్తున్న ట్విస్ట్ కు లాలూ ప్రసాద్ యాదవ్ కౌంటర్ రెడీ చేస్తున్నారు. బీహార్లో అత్యంత విజయవంతమైన నేతగా నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన పార్టీ జేడీయూ ఈయన రాజకీయంతో రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతోంది.
ఒకప్పుడు బీహార్లో అత్యంత బలమైన పార్టీగా ఉన్న జేడీయూ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. అయితే తన ముఖ్యమంత్రి స్థానాన్ని మాత్రం ఆయన కాపాడుకుంటూనే ఉన్నారు. తన కన్నా ఎక్కువ సీట్లు పొందిన బీజేపీ, ఆర్జేడీలు ఆయనకే సీఎం ఆఫర్ ఇచ్చి తమ కూటమి వైపు లాక్కుంటున్నాయి. అంటే జేడీయూ ఎవరి వైపు ఉంటే.. వారికే సీఎం పీఠం వస్తుంది.ఈ పీఠం నితీష్ కే వస్తుంది. ఆర్జేడీతో కలిసి ఓ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆయన తర్వాత ఆ పార్టీని పక్కన పెట్టి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి.. మధ్యలో బీజేపీని డంప్ చేసి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలుస్తున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత సీన్ ఎలా ఉంటుందో కానీ.. నితీష్ కుమార్ లాంటి రాజకీయ నాయకుడు మాత్రం.. దేశ చరిత్రలో అరుదుగా ఉంటారు. తాను ప్రధాని రేసులో ఉన్నానని నితీష్ కుమార్ భావిస్తారు. ఈ మాత్రం విలువలతో ఆయన రాజకీయం చేస్తూ.. ప్రధాని కాదు కదా.. వచ్చే ఎన్నికలతర్వాత ఆయన రాజకీయాన్ని కంటిన్యూ చేయడం కూడా కష్టమన్న వాదన వినిపిస్తోంది.