‘బింబిసార‌’ సీక్వెల్ కాదు… ప్రీక్వెల్‌!

క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘బింబిసార‌’. వ‌శిష్ట ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ హిట్ తోనే వ‌శిష్ట చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడు. ఇప్పుడు ‘బింబిసార 2’ ప‌ట్టాలెక్కుతోంది. అయితే ఈ చిత్రానికి వ‌శిష్ట ద‌ర్శ‌కుడు కాదు. అనిల్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈరోజు క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ‘బింబిసార 2’కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

అయితే ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. బింబిసార ఫ్యూచ‌ర్‌లోకి వ‌స్తే ఏమిట‌న్న‌ది ‘బింబిసార 1’లో చూశాం. ఇప్పుడు ‘బింబిసార‌’ గ‌తంలోకి వెళ్తే ఏమిట‌న్న‌ది ‘బింబిసార 2’ క‌థ‌. క‌ళింగ సామ్రాజ్యంతో ఈ క‌థ ముడిప‌డి ఉంటుంది. ఈ క‌థ పూర్తిగా ఆ కాలం చుట్టూనే తిర‌గ‌బోతోంద‌ని స‌మాచారం. ‘బింబిసార 2’కోసం వ‌శిష్ట ఓ లైన్ సిద్ధం చేశాడు. ఆ క‌థ‌కూ.. ఈ క‌థ‌కూ ఏమాత్రం సంబంధం లేద‌ని తెలుస్తోంది. ఇది పూర్తిగా కొత్త క‌థ‌. క‌ల్యాణ్ రామ్ న‌టించే 22వ సినిమా ఇది. కొస‌రాజు హ‌రికృష్ణ నిర్మాత‌. ఈయ‌న క‌ల్యాణ్ రామ్ కి అత్యంత స‌న్నిహితుడు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌ధారి. దీనికి `మెరుపు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా పూర్త‌య్యాకే ‘బింబిసార 2’ మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

గెస్ట్ రోల్స్ ఉన్నాయి.. డార్లింగ్‌!

రెండు వారాలుగా 'క‌ల్కి' జాత‌ర కొన‌సాగుతోంది. ఈవారం 'భార‌తీయుడు 2' రాబోతోంది. వ‌చ్చే వారంలో డార్లింగ్ వ‌స్తోంది. 'డార్లింగ్‌' చిన్న సినిమానే అయినా, చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి హీరోగా చేసిన సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close