వరుస విజయాలతో టాలీవుడ్ కి ఊపు వచ్చింది. నిర్మాతల బెంగ తీరింది. మొన్న.. సీతారామం, బింబిసార హిట్ల జాబితాలో నిలిస్తే.. ఇప్పుడు కార్తికేయ 2 వసూళ్ల మోత మోగిస్తోంది. నిజానికి ఇవి మూడూ సైలెంట్ హిట్స్. వీటిపై పెద్దగా అంచనాలు లేవు. పైగా బ్యాడ్ సీజన్లో విడుదలైన సినిమాలు. ఓ వైపు వర్షాలు, మరోవైపు ప్రతికూల ప్రభావాలు. వీటి మధ్య విడుదలైన చిత్రాలు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా విజయాలు అందుకొన్నాయి. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్టే బాకీ పడిపోయింది. సీతారామం, బింబిసార, కార్తికేయ 2.. ఇవి మూడూ హిట్లే. ఆ సినిమాల స్థాయి, ఆ హీరోల క్రేజ్ దృష్టిలో పెట్టుకొంటే, వాటికి తగ్గట్టుగానే వసూళ్లు అందుకొన్నాయి. ఇప్పుడు బాక్సాఫీసుకి భారీ లాభాలు, అదిరిపోయే కలక్షన్లు.. కావాలి. అలాంటి ఓ హిట్టు పడితే ఇండస్ట్రీ మొత్తం సెట్ రైట్ అయిపోయింది. ఆ దమ్ము.. ఇప్పుడు `లైగర్`కు ఉంది.
ఈనెల 25న `లైగర్` వస్తోంది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. కాంబినేషన్ పరంగా.. క్రేజీగా ఉంది. ఈ పాటికే విడుదలైన పాటలు, ట్రైలర్.. ఈ సినిమా స్టామినా ఏమిటో చెప్పేస్తున్నాయి. మరోవైపు నార్త్ వైపు భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. అక్కడి జనాలు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్ నుంచి వచ్చే మాస్ మసాలా సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. వాళ్లని ఈ సినిమా ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీతారామం, బింబిసార, కార్తికేయ 2లకు వచ్చిన టాక్ ఈ సినిమాకి వస్తే గనుక… భారీ వసూళ్లు మూటగట్టుకోవడం ఖాయం. బ్లాక్ బస్టర్ అంటే ఎలా ఉంటుందో లైగర్ చూపించేస్తే.. టాలీవుడ్ కి ఆ బెంగ కూడా తీరిపోతుంది. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ లైగర్ పై పడ్డాయి.