కడపలో సీపీఐ పార్టీకి చెందిన నేదలు ఉక్కు పరిశ్రమ కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి కేరళకు చెందిన మాజీ మంత్రి , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం వచ్చారు. ఆయన వచ్చిన సమయంలోనే తుపాను మాండస్ విరుచుకుపడింది. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి.. తుపాను వస్తుందని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి అప్రమత్తత పాటిస్తుందన్న అంశంపై ఆసక్తితో ఏం జరుగుతుందో పరిశీలిచారు. అసలు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఎంతైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కాబట్టి.. తన అసంతృప్తిని దాచుకోలేదు.నేరుగా సీఎం జగన్కు లేఖ రాశారు.
అసలు తుపాను వస్తుదన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. వచ్చిన తర్వాత బాధితులను కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని..ఇదేం పాలన అని జగన్ మొహం మీదనే చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. తాము ముంపు ప్రాంతాల్లో పర్యటించామని వివరించారు. తాము ఎదుర్కొన్న పరిస్థితులను కలెక్టర్కు వివరించడానికి పలుమార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని బినోయ్ విశ్వం లేఖలో స్పష్టం చేశారు.బాధితులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందట్లేదని విస్మయం వ్యక్తం చేశారు.
అయితే సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కేరళ నుంచి వచ్చారు కాబట్టి వింతగా ఉండవచ్చని..కానీ ఏపీలో పాలన అంతే ఉంటుందని..ఆయనకు తెలియదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో వరద వస్తుందని… కేంద్ర జల సంఘం హెచ్చరించినా అన్నమయ్య డ్యాం గురించి మొత్తం తెలిసినా కొట్టుకుపోయేలా ఎలా వ్యవహరించారో తెలిస్తే.. బినోయ్ విశ్వం మరింత ఆశ్చర్యపోతారనే కామెంట్లు వినిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఎప్పుడో అచేతనంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మేమేం చేయగలతం.. అంతా అయిపోయిన తర్వాత ఓ రెండు వేలు ఇవ్వగలం అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉంది. దీన్నే పొగిడే వాళ్లుఉండగా.. ఇక పాలకులకు కావాల్సిందేముంది..? అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఆశ్చర్యపోతూంటారు.