అధికారం రావడమే జగన్‌కు శాపంగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. అధికార అహంకారంతో ఆయన పూర్తి స్థాయిలో అందర్నీ దూరం చేసుకుంటున్నారు. అయినా ఇప్పటికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. మీరే అండగా ఉండాలంటూ ప్రజల్ని వేడుకుంటున్నారు. కానీ అసలు జగన్ ఇంకా గుర్తించని విషయం ఏమిటంటే జనం కూడా జగన్ ను ఎప్పుడో వదిలేశారు.
బీజేపీ ఎందుకు అండగా ఉండదో జగన్‌కు అర్థమవుతోందా ?
జగన్‌కు బీజేపీ ఏ స్థాయిలో అండగా ఉందో.. మొన్న ఇచ్చిన రూ. పది వేల కోట్లు మాత్రమే .. ఎన్నికల సమయంలో ఎలా మానిపులేట్ చేశారో చాలా స్పష్టంగా చూశాం. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పని చేయకుండా… ఎన్నికలక కంటే ముందే వైసీపీకి కావాల్సిన అధికారులను ఈసీ ద్వారా సీఎస్‌లుగా.. డీజీపీలుగా నియమించి పాలనను జగన్ చేతుల్లో పెట్టింది బీజేపీ. అందుకే వివేకా కేసును విచారిస్తున్న ఎస్పీని కూడా ఎన్నికలతో సంబంధం లేకపోయినా ఈసీ బదిలీ చేసింది. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసింది. ఇంతగా అండగా నిలబడిన బీజేపీ నేతు దూరమయిందని.. జగన్ చెబుతున్నారు. ఎందుకు దూరమయిందో ఆయనకు అర్థం చేసుకునేంత తీరిక లేదా ?
తల్లి ఎందుకు దూరమయిందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా ?
జగన్ మోహన్ రెడ్డి ఒక్క సారి చుట్టూ చూసుకుంటే తానేం కోల్పోయారో అర్థం అవుతుంది. ఇప్పుడు ఆయన వెంట తల్లి కూడా లేదు. వైఎస్ చనిపోయాక.. మేరా పాస్ మా హై అంటూ… ఆమెను ఊరూవాడా తిప్పి సానుభూతి పొంది గెలిచారు. ఇప్పుడు ఆ తల్లి మీద కూడా సానుభూతి చూపించలేనంత అధికార అహంకారం నెత్తికెక్కిపోయింది. చివరికి జగన్ కు చెప్పుకోవడానికి … విజయమ్మ .. సజ్జలను కవాల్సిన దుస్థితి. తల్లికే ఇంతటి ఘోరమైన పరిస్థితి తెస్తే… ఇతరుల సంగతేంటి ? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో జగన్ ఆలోచించుకునే ప్రయత్నం చేశారా ?
జనం ఎప్పుడో దూరమయ్యారు – గుర్తించలేకపోతే ఎలా ?
తనను అందరూ వదిలేస్తున్నారని.. కానీ జనం తన వెంట ఉన్నారని జగన్ భ్రమపడుతున్నారు. సొంత తల్లి, చెల్లి నే వదిలేస్తే ఇక జనానికి మాత్రం జగన్ మంచి చేసిఉంటారా. మన ప్లేట్లో మన బిర్యానీ పేరుతో క్యాడర్ ను ఆర్థికంగా దివాలా తీయించిన మాట నిజం కాదా ? ఎంత మంది క్యాడర్ ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా. ఒకప్పుడు లక్షల మంది స్వచ్చందంగా వైసీపీకి సోషల్ మీడియాలో పని చేస్తే ఇప్పుడు డబ్బులిచ్చి పని చేయించుకోవడానికి ఊరూరా తిరగాల్సి వస్తుంది నిజం కాదా ? సొంత వాళ్లే ఛీ కొడుతూంటే.. ఇక జనం ఎలా దగ్గరగా ఉన్నారని అనుకుంటారు .
కొంత మందికి అధికారం శాపంగా మారుతుంది. జగన్ రెడ్డికి దురదృష్టవశాత్తూ అధికారం వచ్చిందని ఆయన శ్రేయోభిలాషులు కూడా బాధపడుతున్నారు. అంతిమ పతనం తర్వాత రియలైజ్ అవుతారా లేదా అన్నది తర్వాతి కథ.