ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాపై టిడిపి బిజెపి నడిపిస్తున్న రాజకీయ ప్రహసనం నూతనాంకం మే 17వ తేదీన చూడవచ్చు. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమంటున్నారు. దానికి ముందు ఆర్థిక శాఖ కార్యదర్శి పి.వి.రమేష్ నాయకత్వంలో బృందంవెళ్లి చర్చలు చేస్తుందంటున్నారు. ఈ తతంగమంతా జరిపించి ో భారీ సహాయం ఇవ్వబోతున్నట్టు మరోసారి ప్రకటించి సర్దుకుంటారు. అంతకన్నా ఒరిగేది వుండదు. విజయవాడలో ఎపి బిజెపి కోర్ కమిటీకి హాజరైన జాతీయ నేత సిద్ధార్థసింగ్ అన్ని విధాల ఆదుకుంటామని హామీలు కురిపిస్తూనే తెలుగుదేశం నేతలు తమను విమర్శించడాన్ని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హౌదా అడిగారా లేదా అంటే జవాబు మీకే తెలుసని దాటేశారు. సరిగ్గా ఆ సమయంలోనే టిడిపి ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశంకూ పడుతుందని ధ్వజమెత్తారు. . ప్రజల్లో అసంతృప్తి దృష్ట్యా ఇరు పార్టీలు మరోసారి పరస్పరం తిట్టుకుంటున్నాయి తప్ప ఉభయ వాదనల్లోనూ వాస్తవం లేదు. ప్రత్యేక హౌదా రాదని మానసికంగా సిద్ధం చేసే ప్రక్రియ మొదలుపెట్టిందే వెంకయ్య నాయుడు. అదేమీ సంజీవని కాదని సన్నాయి నొక్కులు నొక్కింది చంద్రబాబు. అమరావతికి వచ్చిన ప్రధానిని ే ప్రత్యేక హౌదా అడక్కుండా పంపించడంబహిరంగంగాన అందరూ చూశారు. ఏమైనా ఇవ్వాలని అడిగిందీ, ఇస్తామని ప్రణాళికలో చెప్పిందీ ఇప్పుడు ప్రధాని పదవి నిర్వహిస్తున్నది బిజెపి గనక వారు మాట మార్చడం విశ్వాస ఘాతుకమే. ఇక రకరకాలుగా మాట్లాడుతూ హౌదా కన్నా ప్యాకేజీ మేలని సంజీవని కాదని వారికి పరోక్షంగా వూతమిచ్చింది తెలుగుదేశం. విజయవాడలో వెంకయ్య వాక్కులతో మొదలై పార్లమెంటు సాక్షిగా ప్రకటించేవరకూ నడిచింది. . . 17వ తేదీ తర్వాత ఈ ఉభయ పార్టీలూ మరోసారి ఎపి ప్రజల చెవిలో పూలు పెడతాయన్నమాట. అంతేగాని ఛానళ్లలోచెప్పినట్టు చంద్రబాబు చెవిలో కాదు!