భారతీయ జనతా పార్టీ, వైసీపీల మధ్య చెలరేగిన రాజకీయ రచ్చ.. మూడు రోజుల కిందట వరుకూ.. హైలెట్ అయింది. చూసుకుందామంటే.. చూసుకుందామని.. విజయసాయిరెడ్డి , కన్నా లక్ష్మినారాయణ వరుస ప్రెస్మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి కన్నాపై తీవ్రమైన ఆరోపణలు చేయడం… బీజేపీ అంతర్గత విషయాలపైనా ఆరోపణలు చేయడంతో.. విషయం సీరియస్ అయింది. అయితే.. హఠాత్తుగా అటు బీజే్పీ.. ఇటు వైసీపీ నేతలు సైలెంటయిపోయారు. తమ మధ్య ఏమీ జరగనట్లుగా ఉంటున్నారు. అసలు వివాదం రేగిన… ర్యాపిడ్ టెస్ట్ కిట్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
వైరస్ ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ… కన్నా లక్ష్మినారాయణ ఆరోపించడం.. దానిపైన విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఆరోపణలు ప్రారంభించడంతో.. రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ఈ విషయం హైకమాండ్ కు చేరింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. బీజేపీ నేతలు.. ఈ అంశాన్ని సైడ్ ట్రాక్‌కు తీసుకెళ్లారు. ఎవరూ ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో అవినీతి గురించి మాట్లాడటం లేదు. అలాగే..వైసీపీ నేతలు కూడా.. ఆ అంశం గురించి.. కన్నాపై ఆరోపణలు చేయడం లేదు. దీంతో.. ఇప్పటికైతే ఆ అంశంపై రాజకీయం చల్లబడిపోయిందని.. క్లారిటీ వచ్చేసిందంటున్నారు.
హైకమాండ్ ఏం చెప్పిందో బయటకు రాలేదు కానీ.. ప్రస్తుతం బీజేపీ మార్చుకున్న స్టాండ్ ప్రకారం… “ఆరోపణల విరమణ” ఒప్పందం ఫాలో అవ్వాలని డిసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే… కన్నా జగన్‌కు మరో లేఖ రాశారు. అందులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా..జర్నలిస్టులకు బీమా కల్పించాలని కోరారు.
ఢిల్లీ స్థాయిలో బీజేపీకి వైసీపీ నమ్మకమైన మిత్రునిగా వ్యవహరిస్తోంది. అధికారికంగా మాత్రం కాదు. అనధికారింగా… తమ కంటే.. నమ్మకమైన మిత్రుడు ఎవరూ ఉండరని.. విజయసాయిరెడ్డి నమ్మకం కలిగించగలిగారని అంటున్నారు. తమ అంతర్గత విషయాలు .. ఎన్నికల ఖర్చుకు డబ్బులు పంపడం… వాటిని ఇతర నేతలు మిగుల్చుకోవడం.. ఇవన్నీ బీజేపీ అంతర్గత విషయాలు. విజయసాయి జోక్యం చేసుకున్నందుకు ఆయనపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చాలా మంది అనుకున్నారు కానీ…. సైలెంటవ్వాలనే సూచనలు రావడంతో.. బీజేపీ నేతలు కూడా మనకెందుకులే అని.. కామ్ అయిపోతున్నారు.