భారతీయ జనతా పార్టీ నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కాని పరిస్థితి. ఏపీ నేతలే కాదు… ఢిల్లీ నేతలూ అంతే. ఎప్పుడో నెల రోజుల కిందట.. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం… వరవరరావును విడుదల చేయమని కోరడం. నెల రోజుల కిందట.. మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావుకు కరోనా సోకడంతో పరిస్థితి విషమంగా మారిందని ప్రచారం జరిగింది. దాంతో ఆయనను విడుదల చేయాలని.. ప్రజాసంఘాల నేతలందరూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. నక్సలైట్ ఉద్యమంలో ఒకప్పుడు పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి అదే భావజాలంతో… వెంకయ్యనాయుడుకి లేఖ రాసి.. విడిపించాలని కోరారు. ఆ తర్వాత లేఖ సంగతి అందరూ మర్చిపోయారు.
హఠాత్తుగా ఈ లేఖను పట్టుకుని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ ట్విట్టర్లోకి వచ్చేశారు. వైసీపీ ద్వంద ప్రమాణాలకు ఇదే సాక్ష్యం అని విమర్శలు ప్రారంభించారు. జగన్ ప్రధానిని కలిసిన వెంటనే ఫోటోలు విడుదల చేస్తున్నారని…కానీ, ఆయన పార్టీ నేతలు మాత్రం ప్రధాని మోడీని హతమార్చేందుకు కుట్ర పన్నిన వరవరరావును విడుదల చేయాలంటూ లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు.. భూమన కరుణాకర్ రెడ్డిపై క్రమశిక్షనా చర్యలు తీసుకోవాలని… క్షమాపణ కూడా చెప్పించాలని సునీల్ ధియోధర్ డిమాండ్ చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కావొచ్చు.. జగన్మోహన్ రెడ్డికి బంధువు కావొచ్చు కానీ. .ఆయన మాత్రం.. వైసీపీ తరపున ఆ లేఖ రాయలేదు. అది మాత్రం స్పష్టం. ఒక వేళ హైకమాండ్ ఆదేశాల ప్రకారం.. వెంకయ్యనాయుడుకి ఆ లేఖ రాసి ఉంటే .. ఆ విషయాన్ని బయటకు చెప్పుకునేవారు. అయినా ఎప్పుడో నెల క్రితం రాసేసిన.. అందరూ మర్చిపోయిన లేఖను.., బీజేపీ నేతలు ఇప్పుడు బయటకు తీసి.. క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేయడం వెనుక ఏ రాజకీయం ఉందో.. వైసీపీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు.
.@ysjagan Ji, you post photos with Modiji after meeting him.
On the other hand, your MLA Bhumana Karunakar appeals to release a hardcore #NaxaliteVaravaraRao who plans to assassinate Modiji.
Stop this double standards & take action on him & apologise.#MaoistAgainstConstitution pic.twitter.com/s7zf02X2Ip— Sunil Deodhar (@Sunil_Deodhar) August 29, 2020