ట్రాఫిక్ చలానాలపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలతో.. మోడీని ధిక్కరించడానికి కూడా.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి మెల్లగా ఒక్కో రాష్ట్రానికి చేరుతోంది. కొద్ది రోజుల క్రితం.. కేంద్రం… ట్రాఫిక్ ఉల్లంఘనలకు అత్యంత భారీగా జరిమానాలు విధిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం దెబ్బకు… ట్రాఫిక్ ఉల్లంఘిస్తే.. వాహనదారులు.. ఆ వాహనాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ట్రాఫిక్ పోలీసులపై దాడులకు కూడా కారణం అవుతోంది. అసహనంతో కొంత మంది రోడ్డుపైనే తమ వాహనాలకు నిప్పు పెడుతున్నారు. చలాన్ల విషయం… ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అలజడికి కారణం అవుతోంది. ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలపై… విపరీతంగా ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. రోడ్డు సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ట్రాఫిక్ చలాన్లపై ప్రజల్లో ఓ రకమైన తిరుగుబాటు సూచనలు కనిపిస్తూండటంతో.. బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందుగా అప్రమత్తమయ్యాయి. నిజానికి అది కేంద్ర చట్టం.. రాష్ట్రాలు అడాప్ట్ చేసుకుంటనే.. తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆయా ప్రభుత్వాలు అంగీకరిస్తేనే అమలవుతుంది. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీనే.. అత్యధిక రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే్ కాబట్టి.. దాదాపుగా అన్నీ అమల్లోకి తీసుకొచ్చాయి. బెంగాల్ సర్కార్ మాత్రం.. తాము అమలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలు ప్రారంభమై… వారం రోజులు కాక ముందే… తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమయింది. దీన్ని ముందుగా గుజరాత్ సర్కార్ గుర్తించింది. మోడీ చట్టాన్ని ఉన్న పళంగా… సవరించేసింది. ట్రాఫిక్ చలానాల జరిమానాలను 50 నుంచి 90 శాతం వరకూ కట్ చేసింది. ప్రజాగ్రహాన్ని కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేసింది.
ఇప్పటి వరకూ కొత్త చట్టాన్ని మారిస్తే… మోడీ ఏమనుకుంటారోనని.. తటపటాయించిన బీజేపీ ముఖ్యమంత్రులు… గుజరాత్ సీఎం ముందడుగు వేయడంతో… ధైర్యం చేస్తున్నారు. తమ రాష్ట్రంలోనూ.. ట్రాఫిక్ చలానాలను కొత్త చట్టం ప్రకారం వసూలు చేయబోమని.. కర్ణాటక కూడా ప్రకటించింది. మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. ఇక బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, కేరళ, ఢిల్లీ కూడా.. కొత్త చట్టాన్ని అమలు చేయకూడదన్న ఆలోచన చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్.. కొత్త చట్టాన్ని మధ్యప్రదేశ్లో అమలు చేసేది లేని ప్రకటించేశారు. కేంద్ర చట్టం ప్రకారం కాకుండా.. కర్ణాటక చట్టం ప్రకారమే.. ట్రాఫిక్ చలానాలు ఉంటాయని కర్ణాటక సీఎం యడియూరప్ప.. ప్రజలకు హామీ ఇచ్చారు. మొత్తానికి మోడీ తెచ్చిన చట్టం ప్రజావ్యతిరేకతను పెంచుతోందని… బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా.. ఒప్పుకున్నట్లయింది.