అప్పుడెప్పుడో.. పవన్ కల్యాణ్ గురించి.. అల్లు అర్జున్‌ని అడిగితే… ” చెప్పను బ్రదర్” అనేశారు..! ఎవరు పవన్ గురించి అడిగినా ఆదే సమాధానం..!. చివరికి మనసు మార్చుకుని.. చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు.. అదే స్టైల్లో.. కాస్త టోన్ మార్చి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా… ” అడుగుతూ.. ఉంటా.. ఇచ్చేదాకా అడుగుతూ ఉంటా..” అని హోదా గురించి చెబుతున్నారు. అయితే.. ఆయన అలా అడిగిన మరుక్షణం.. ఇలా.. రిప్లయ్ ఘాటుగానే కాదు.. సూటిగా వస్తోంది.
హోదా అడగడమే కానీ.. వాళ్లేం చెబుతున్నారో పట్టించుకోరా..?
ప్రత్యేకహోదా గురించి అడుగుతానంటూ.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రకటిస్తే.. వెంటనే కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వారు ఎవరో ఒకరు.. రియాక్షన్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తిరుపతికి వచ్చిన పీయూష్ గోయల్… ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పక్కన ఉండగానే… ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని… గత ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఇచ్చిన ప్యాకేజీతో సర్దుకోవాలని నేరుగా చెప్పారు. అయితే.. దీన్ని మంత్రి పట్టించుకోలేదు సరికదా… మా విధానం అడగడమే కానీ.. వారు ఏం చెబుతారో.. మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఆయన మాత్రమే కాదు.. వైసీపీ నేతలందరి తీరు అంతే ఉంది.
కిషన్ రెడ్డికి కూడా హోదా ముగిసిన అధ్యాయనమేనట..!
తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కిషన్ రెడ్డికి.. ఓ కేంద్రమంత్రి పదవి దక్కింది. అది కూడా.. అమిత్ షాకు డిప్యూటీ. ఆయనకు ఉన్న ఇద్దరు డిప్యూటీల్లో ఒకరు కిషన్ రెడ్డి. సాధారణం అమిత్ షా అంటే.. నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇతురలకు ఉండదు. కనీసం సొంతంగా ఓ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేరు. ఇలా ఇచ్చి.. మొదటి రోజే.. చీవాట్లు తిన్నారు కిషన్ రెడ్డి. ఆయన పని.. కేంద్రమంత్రి హోదాను పట్టుకుని… తెలుగు రాష్ట్రాల్లో ప్రోటోకాల్‌ను పొంది.. అధికార పర్యటనలు చేయడమే. సొంత నియోజకవర్గంలో పలుకుబడి పెంచుకోవడమే. అయినా కూడా పెత్తనం తీసుకుని… ఏపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయనమి తేల్చేస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు .. స్పందించడానికి కూడా సందేహిస్తున్నారు.
కేంద్రమంత్రుల ప్రకటనలను వైసీపీ ఎందుకు ఖండించడం లేదు..?
ప్రత్యేకహోదా విషయంలో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేసి.. రాజీనామాలు చేసి దీక్షకు కూర్చుంటే.. హోదా ఎందుకు రాదో చూద్దామన్న జగన్.. ఇప్పుడు… ఎందుకు.. అంత సామరస్య ధోరణితో వెళ్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. అధికారంలో ఉంటే.. ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. ప్రజలకూ పజిల్‌లానే మారింది. చివరికి.. తాము సన్నిహితంగా ఉంటున్న బీజేపీ కేంద్రమంత్రులే… అదే పనిగా.. హోదా సాధ్యంకాదని చెబుతూంటే.. ఒక్క ఖండన ప్రకటన కూడా చేయడం లేదు.