పవన్ కల్యాణ్ అడిగి మరీ పొత్తు పెట్టుకున్నారు. దానికి బీజేపీ ఇస్తున్న బహుమానం ఏమిటంటే.. ఆయనకుఓటు బ్యాంక్‌గా ఉంటున్న వారిని ఆకర్షించడానికి ప్రత్యేకంగా మిషన్ ప్రారంభించడం. అవునన్నా… కాదన్నా.. పవన్ కల్యాణ్ ప్రధాన బలం కాపు ఓటు బ్యాంక్. కాపుయువత ఆయన వైపు ఉన్నారు. ఆయనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయంటే.. అదీ కూడా.. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వచ్చాయంటే… ఆ బలం ఎక్కడితో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ కాపు ఓటు బ్యాంక్‌ను తమ పార్టీ వైపు మళ్లించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోేంది.
సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి .. ఓ వర్గాన్ని పార్టీ నుంచి పంపేసి… కాపు వర్గాన్ని దగ్గర చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమైన కాపు నేతల్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన సోము వీర్రాజు.. పార్టీలోకి ఆహ్వానించడం మాత్రమే మొత్తం కాపు సమాజాన్ని గతంలో రెచ్చగొట్టినట్లుగా చేసి… బీజేపీ వైపు మళ్లించాలనే పెద్ద టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా సోము వీర్రాజు చెప్పారు. పెద్ద బాధ్యతే ఇచ్చామని… ఆలోచించుకుని చెబుతామన్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
మరికొంత మంది కాపు నేతలపై గురి పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాపులను తమవైపు వైపునకు తిప్పుకుంటే.. ఇక పవన్‌తో బీజేపీకి అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే.. బీజేపీతో దగ్గరగా.. దూరంగా అన్నట్లుగా ఉంటున్నారు. తన కార్యక్రమాలు తాను చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వర్గాన్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకోకపోతే.. బీజేపీకి మనుగడ కష్టం. అందుకే… పవన్ ని ఈజీగా డీల్ చేసి… ఆయన ఓటు బ్యాంక్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.