భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో మార్పులు చేయడం… ఈశాన్య రాష్ట్రాలకు నచ్చడం లేదు. ఈ బిల్లుపై ప్రజల్లో తీవ్రమైన చర్చ జరగకపోయినప్పటికీ.. కొన్ని వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ఈ ఘర్షణలు ప్రాణ నష్టానికి దారి తీస్తున్నాయి. పలు చోట్ల కర్ఫ్యూ విధఇంచారు. షిల్లాంగ్ పర్యటనకు వెళ్లాల్లిన అమిత్షా .. చివరి నిమిషంలో ఆగిపోయారు. బెంగాల్, ఢిల్లీలో భారీ నిరసనలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్, ఢిల్లీలో శుక్రవారంనాడు భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
పౌరసత్వ సవరణ బిల్లు అమలు చేసేది లేదని ఐదు రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే చట్టం అమలును నిరాకరించే అధికారాలు రాష్ట్రాలకు లేవని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో ఈ చట్టాన్ని చేర్చినందున పౌరసత్వ సవరణ చట్టం అమలును నిరాకరించే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, పౌరసత్వం, స్వదేశస్థునిగా అంగీకరించడం సహా 97 అంశాలు 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్నాయని వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏర్పడే అవకాశం ఉన్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది.
పౌరసత్వ చట్టాన్ని సవాలు చేస్తూ టీఎంసీ నేత మహువా మొయిత్ర, ఎంపీ జయరాం రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొట్టివేయాల్సిందిగా పిటిషన్లోవారు కోరారు. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, చెల్లనేరదని, భారత రాజ్యాంగంలోని 14, 12 అధికరణకు ఇది పూర్తి విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. 1985 అసోం ఒప్పందం, భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పౌరసత్వ సవరణ చట్టంపై తగిన ఆదేశాలు ఇవ్వాలని వారంటున్నారు.