ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతున్న దాడులు.. జరగిన దాడుల్లో టీడీపీ, బీజేపీ ప్రమేయం ఉందని డీజీపీ గౌతం సవాంగ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. దీనిపై ఆ రెండు పార్టీల నేతల భగ్గుమన్నారు. అయితే ఐపీఎస్ అధికారి రాజకీయ ఆరోపణలు చేయడంపై.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా తాము సైలెంట్‌గా ఉండకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. తక్షణం గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని… లేకపోతే.. చట్ట ప్రకారం క్రమినల్ చర్యలు.. పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… డీజీపీ గౌతం సవాంగ్‌కు ఇంగ్లిష్‌లో ఓ ఘాటు లేఖ రాశారు.
భారతీయ జనతా పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని వారు నమ్ముతున్నారు. తమపై రాజకీయ కుట్ర చేస్తున్నారని అనుకుంటున్నారు. అందుకే డీజీపీ స్పందన విషయాన్ని వారు హైకమాండ్ పెద్దలకు తెలిపారు. డీజీపీ ప్రెస్మీట్లో ఏం మాట్లాడారు.. అలాగే.. ఆ తర్వాత బీజేపీ నేతల ప్రమేయం అంటూ.. ఇచ్చిన కేసుల వివరాలు… హైకమాండ్ పెద్దలకు పంపారు. దుష్ప్రచారం వెనుక ఉన్న అసలు కుట్రను వారికి వివరించినట్లుగా తెలుస్తోంది. కేసుల సంగతేమో కానీ.. ముందుగా ప్రజల్లో ఓ రకమైన అనుమానాల్ని పంపడం కోసం… ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ రాటు దేలిపోయిందని .. ఆ ప్రయోగాన్ని బీజేపీపై చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీపై తీవ్రమైన నింద వేయడంతో… ఏ మాత్రం ఉపేక్షించకూడదన్న అభిప్రాయం ఢిల్లీ నేతల నుంచి రావడంతో… సోము వీర్రాజు.. డీజీపీకి ఘాటు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. పార్టీ పరంగానే రాసినా… అధికారికంగా… దానికి డీజీపీ సమాధానం ఇచ్చి తీరాలన్నట్లుగా .. ఓ రకంగా లాయర్ నోటీసులాగా.. ఆ లేఖ ఉంది. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. చేసిన ఆరోపణలపై ఇప్పుడు సమాధానం ఇవ్వకపోతే.. బీజేపీ… చట్ట పరంగా.. క్రిమినల్… పరువు నష్టం కేసులు దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఓ డీజీపీగా గౌతం సవాంగ్‌కు తలనొప్పులు తెచ్చుకున్నట్లే అవుతుందని చెబుతున్నారు.