తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హఠాత్తుగా దళితుల సమస్యలు గుర్తుకు వచ్చాయి. వారం రోజుల క్రితం.. తెలంగాణలోని యాదాద్రిలో మరియమ్మ అనే దిళిత మహిళ హత్యకు గురైతే.. కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ అడిగే వరకూ అది గుర్తుకు రాని కేసీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వగానే.. స్పందించారు. మరియమ్మ కుటుంబానికి సాయం ప్రకటించారు. వెంటనే అసలు దళితులపై జరుగుతున్న దాడుల గురించి.. అసలు వారెందుకు అభివృద్ధి చెందడం లేదనే గురించి చర్చి.. అర్జంట్‌గా వారిని అభివృద్ధి చేసేందుకు సూచనలు సలహాలు తీసుకునేందుకు సాధికారిత సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల దళిత నేతలను ఆహ్వానించారు. సమావేశంలో.. కేసీఆర్ దళితుల్నిఎలా పైకి తీసుకురావాలన్నదానిపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో..దళిత యువత స్వయం ఉపాధిని అన్వేషించాలని అందుకే.. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించారు. దీని కోసం వెయ్యి కోట్లు కేటాయించామని.. ఇదంతా.. సబ్ ప్లాన్‌కు అదనమన్నారు. సబ్‌ప్లాన్‌తో కలిపి రాబోయే మూడు-నాలుగేళ్లలో 35 నుంచి 40 వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం చేస్తుందని ప్రకటించారు. హాజరైన వారందరికి మంచి అతిధి మర్యాదలు చేసి కేసీఆర్ పంపించారు. రెండు రోజుల కింట.. కేసీఆర్‌తో భేటీ అయిన కాంగ్రెస్ నేతల్లోని దళిత నేతలు మళ్లీ వెళ్లారు. బీజేపీ నేతలు మాత్రం బహిష్కరించారు. దళితులకు మేలు చేయాలనుకుంటే.. ముందుగా తెలంగాణ ఉద్యమ సమయంలో దళితునికే ముఖ్యమంత్రి పదవి అని ఇచ్చిన హమీని నెరవేర్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అది చేయకుండా.. ఎన్ని మాటలు చెప్పినా దళితులు నమ్మరని విమర్శలు ప్రారంభించారు. హుజూరాబాద్‌లో నలభై వేలకుపైగా దళితుల ఓట్లు ఉన్నాయని.. వాటి కోసమే.. కొత్త నాటకాలనీ విమర్శలు ప్రారంభించారు. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా.. దానికో రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షనే దళితుల కారణమైతే.. దళిత ఎంపవర్ మెంట్ పథకంపై మరింత జోరుగా ప్రచారం జరిగే అవకాశం కనిపిస్తోంది.