కేంద్రంలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఎగ్దిట్ పోల్స్ అన్నీ తారుమారయ్యాయి. యూపీ, బీహార్, మహారాష్ట్ర , బెంగాల్ వంటి చోట్ల అనుకున్న విధంగా బీజేపీ ఫలితాలు సాధించలేకపోవడంతో వెనుకబడిపోయింది. పూర్తి మెజార్టీకి 272 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ నెంబర్ 240 దగ్గరే ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇతర ఎన్డీఏ మిత్రులు అరవై సీట్ల వరకూ సాధిస్తున్నారు. దీంతో మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా అవరోధం లేదనుకోవచ్చు.
అయితే ఈ సారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎదుకంటే బలమైన ప్రతిపక్షం తయారయింది. ఇండి కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. బలాన్ని రెండింతలు చేసుకుంది. 97 సీట్ల వరకూ సాధిస్తోంది. మిగతా పక్షాలు తృణమూల్ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేసి ఏకంగా 31 చోట్ల విజయం సాధించింది.త తమిళనాడు, కేరళల్లో బీజేపీ అనుకున్న విధంగా ముందుకు రాలేదు. కర్ణాటకలో మంచి పలితాలు సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సాధించింది. తెలంగాణలో ఎనిమిది సీట్లలో ముందంజలో ఉంది.
నాలుగు వందల సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న ఎన్డీఏ కూటమికి మూడు వందల సీట్లు సాధించడం సాధ్యం కావడం లేదు. అయితే ఈ పరిస్థితి మంచిదేనని..బలమైన ప్రతిపక్షం ఉండటం వల్ల మోదీ .. దూకుడు తగ్గుతుదంని భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు.. అరెస్టులు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.