ఎన్నికల ప్రచారం అంటే.. అధికార పార్టీ తాను ప్రజలు ఎంత చేశారో .. దేశానికి ఏం చేశారో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. విపక్ష పార్టీ… ఐదేళ్లలో… అధికార పార్టీ చేయలేదని దాన్ని చెప్పుకోవాలి.కానీ.. ఇప్పుడు… అసలు ఐదేళ్లలో ఏం జరిగిందో… ప్రచారంలోకి రాకుండా.. బీజేపీ చేసుకుంది. దాని కోసం.. వివాదాస్పదఅంశాలను తెరపైకి తీసుకు వచ్చింది. తాము చేశామో కనీసం ప్రజల్లో చర్చకు రాకుండా… చేసి.. ఎన్నికల సముద్రాన్ని బీజేపీ ఈదింది.
ఐదేళ్లలో బీజేపీ చేసిన “ఘనకార్యాలు” ఎందుకు చెప్పుకోరు..?
2014లో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో… దేశం మొత్తం ఆయనను ఓ బాహుబలిగా చూసింది. ఎన్నికల ప్రచారంలో… మేనిఫెస్టోలో..బీజేపీ చెప్పిన అంశాలు చూస్తే.. ఇండియా.. అమెరికాగా మార్చేసే ప్లాన్లు మోదీ దగ్గర ఉన్నాయని జనం నమ్మారు. దేశంలో ఉన్న బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని తెస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వస్తాయన్నారు. అంటే.. ఒక్క కుటుంబంలో సగటున ముగ్గురున్నా.. కుటుంబానికి అర కోటి వచ్చి పడతాయి. అంటే.. సగం అమెరికా అయిపోయినట్లేనని అనుకున్నారు. ఆ నల్లధనం దగ్గర్నుంచి… ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, మేకిన్ ఇండియా, స్వచ్చభారత్, డిజిటల్ ఇండియా, రైతులకు రెట్టింపు ఆదాయం.. ఇలా నినాదాల మీద నినాదాలు వచ్చాయి.. అందరూ అహో.. ఓహో అనుకున్నారు. అచ్చేదిన్ వచ్చాయనుకున్నారు. కానీ అవి రాకుండానే పోయాయని… తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు.
మోడీ”స్ నిర్ణయాలు గుర్తొస్తే ఓట్లేయరని భయమా..?
నోట్ల రద్దు చేశారు. అది దేశ గతిని మార్చేస్తుందని ప్రచారం చేశారు. ఫలితాలు రాకపోతే.. నిలువునా కాల్చేయమని మోదీ సవాల్ చేశారు కూడా. అదయిపోయింది…తర్వాత జీఎస్టీ తీసుకొచ్చారు. అది ఓ పన్ను సంస్కరణ. కానీ.. దాన్నుంచి రాజకీయ మైలేజీ పొందడానికి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఫలితంగా జీఎస్టీ అంటే.. అదో కొత్త పన్ను అన్న ప్రచారం జరిగింది. అప్పట్నుంచి ఏ వస్తువు రేటు తగ్గకపోగా.. అన్నీ పెరిగిపోయాయి. చివరికి.. ప్రతీ ఇంటిలోనూ.. ఉండే కేబుల్ టీవీపైనా జీఎస్టీ బాదేశారు. దేశంలోఉన్న 45కోట్ల కుటుంబాలపై… ఒక్క కేబుల్, డీటీహెచ్ భారం.. 150 నుంచి 300వరకు పడింది. ఇక మిగతా నిత్యావసర వస్తువులపై పడిన భారం అంతా ఇంతా కాదు. అంటే.. ఐదేళ్లలోనే సీన్ మారిపోయింది. మోదీ… ఎంత చెప్పినా….కనీసం ఒక్క శాతం కూడా…చేయలేదని మాత్రం.. ఐదేళ్లలో ప్రజల్లో క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ సరిగానే గుర్తించింది.
కుల, మత, ప్రాంతాల గొడవలతో ఓట్లు సాధించేసి గెలిచేస్తారా..?
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి …తమ పాలనా తీరు ఏ మాత్రం.. ఓటింగ్ అంశం కాకూడదని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్లుగానే.. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. నరేంద్రమోదీ ఇప్పటి వరకూ..తన ప్రచారంలో పాకిస్తాన్ ను వాడుకున్నారు.. ఉగ్రవాదులను వాడుకున్నారు…చరిత్రలో జరగని వాటిని జరిగినవిగా చెప్పుకున్నారు… సైన్యం తనదేనన్నారు… కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందన్నారు.. చివరికి చనిపోయిన రాజీవ్ గాంధీపైనా మళ్లీ దాడి చేశారు. కానీ.. ఐదేళ్లలో తాను ఏం చేశానో మాత్రం చెప్పలేదు. ఒక్కటంటే.. ఒక్క బహిరంగసభలో..నోట్ల రద్దు గురంచి మాట్లాడలేదు. ఒక్కటంటే.. ఒక్క సభలో జీఎస్టీ గురించిమాట్లాడలేదు. గత ఎన్నికలకు ముందు తాను చేస్తానని చెప్పిన బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షలు వేయడం దగ్గర్నుంచి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వరకూ.. దేని గురించీ మాట్లాడం లేదు. ఎందుకంటే.. ఐదేళ్లలో… ఆ హమీల విషయంలో.. ఒక్క ముందడుగు పడలేదు.కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి వల్ల.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాఫెల్ లాంటి స్కాములు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా వాటిపై కనీసం స్పందించడం లేదు… అదే సమయంలో… విద్వేష ప్రచారంలో మాత్రం..ముందున్నారు…
బీజేపీ ప్రచార వ్యూహాన్ని ఎదుర్కోవడంలో విపక్షాలూ విఫలం..!
బీజేపీ నేతలు వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. బీజేపీ తనకు ఉన్న అధికార బలం, ఆర్థిక అండదండలు, భయభక్తులతో ఉండే మీడియా సాయంతో వ్యూహాన్ని అమలు చేసింది. వివాదాస్పద ప్రకటనలు చేస్తూ.. విపక్షాలపై …ఎటాక్ చేస్తూండంతో..వాటిని ఎదుర్కోవడానికే విపక్ష పార్టీలు సమయం కేటాయించాల్సి వచ్చింది. ప్రాంతాల వారీగా, విడతల వారీగా తీవ్రత పెంచుతూ ద్వే ష భాష రెచ్చిపోయింది. దీని వల్ల బీజేపీ ఐదేళ్ల పాలనా వైఫల్యాలు జనంలోకి చర్చకు రాలేదు. కానీ మధ్యతరగతి జీవి మనసులో ఓటు వేసేటప్పుడు… తాము పడిన కష్టాలను గుర్తుంచుకునే ఉంటారు..!