తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం.. వంద శాతం సహకరించిన భారతీయ జనతా పార్టీకి .. తెలంగాణలో ఏం మిగిలింది. రాక రాక వచ్చిన ఐదు అసెంబ్లీలోసీట్లలో రెండు కోత పడిపోయారు. బీజేపీ పోటుగాళ్లమని చెప్పుకుంటున్న నేతలంతా పరాజయం పాలయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పాతబస్తీలో హిందూత్వ వాదంతో.. తనదైన బలం ఏర్పాటు చేసుకున్న రాజాసింగ్ లోథ్ మాత్రమే బయటపడ్డారు. వరుసగా గెలుస్తూ వస్తున్న కిషన్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఉప్పల్ లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్ లో చింతల రామచంద్రారెడ్డి కూడా దారుణంగా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. బీజేపీ సిట్టింగ్ సీట్లు గెలుచుకోవడానికి ఎంతో కొంత సహకారం కేసీఆర్ అందిస్తారని.. బీజేపీ నేతలు ఆశ పడ్డారు.
కానీ.. వారికి ఎలాంటి సహకారం అందలేదు. చివరికి ముషీరాబాద్ లో.. లక్ష్మణ్ కూడా.. గెలవలేకపోయారు. లక్ష్మణ్ కోసం… ముఠా గోపాల్ చేత ప్రచారం నిలిపి వేయించారన్న వార్తలు గుప్పుమన్నాయి. అవి కూడా లక్ష్మణ్ ను బయటపడయలేకపోయాయి. లగడపాటి సర్వేలో. . జిల్లాల్లోనూ సట్లు వస్తాయని.. చెప్పడంతో..వారు ఆనందంలో మునిగిపోయాయి. కానీ జిల్లాల్లో డిపాజిట్లు మాత్రం రాలేదు. నికి టీఆర్ఎస్ కు ఎనలేని సాయం అందిస్తూ.. తన గొయ్యిను తాను.. బీజేపీ తవ్వుకున్నట్లయింది. చివరికి ఒక్క ఎంఎల్ఏ తో నే సరి పెట్టుకోవా ల్సి వచ్చింది.
ఇప్పుడు బీజేపీ బలపడిందని అనుకోవడానికి లేకుండా పోయింది. ఫలితాలు రాక ముందే తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తామని ప్రకటించుకుని… మొత్తానికే బకరాలయిపోయారు. ఇక బీజేపీకి.. తెలంగాణలో మళ్లీ స్వతంత్రంగా ఎదగడం కష్టమే అనుకోవాలి. వారికి రాజాసింగ్ లోథ్ ఒక్కరే దిక్కు ఇప్పుడు. ఆయనే హిందూత్వవాదంతో బీజేపీకి జవసత్వాలు కల్పించాల్సి ఉంది. విశేషం ఏమిటంటే… రాజాసింగ్ ను.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వారితో రాజాసింగ్ ఓ ఆట ఆడుకునే అవకాశం ఉంది