తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. మల్కాజిగిరి టిక్కెట్ విషయంలో ఈటల రాజేందర్ తన పట్టు నిరూపించుకున్నారు. మురళీధర్ రావు సహా అనేక మంది పోటీ పడినా .. బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించినా ఈటల రాజేందర్‌కే టిక్కెట్ ప్రకటించారు. రెండు రోజుల ముందే ఆయనకు సమాచారం రావడంతో… అనుచరులతో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు కూడా.
ఇక సిట్టింగ్‌లలో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ,సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి చాన్స్ వచ్చింది. అయితే ఆదిలాబాద్ ఎంపీ విషయాన్ని మాత్రం పెండింగ్ పెట్టారు. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి ఇటీవల పార్టలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ కు చాన్సిచ్చారు. ఒక్క రోజు ముందు పార్టీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు కూడా తొలి జాబితాలోనే చాన్స్ దక్కింది. ఇక చేవె్ళ్ల నుంచి అందరూ ఊహించినట్లగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు ఉంది. హైదరాబాద్ కు మాధవీలత అనే లీడర్ ను ఖరారు చేశారు.
మహబూబ్ నగర్ నుంచి గట్టి పోటీ ఉండటంతో ఇంకా ఫైనల్ చేయలేదు. దేశవ్యాప్తంగా 190 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది.