తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రావాలని డిసైడయింది. నెలాఖరులోగా జాతీయ బీజేపీ అధ్యక్షుడి నియామకంతో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చనున్నారు. ఇందు కోసం ఎన్నికల ఇంచార్జులను ప్రకటించారు. శోభా కరంద్లాజే తెలంగాణ ఎన్నికల అధికారిగా వస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ ఏమీ ఉండకపోయినా ప్రజాస్వామ్య బద్దంగా జరిగిపోయిందని అనిపించడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.
తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో హైకమాండ్ కూ చిక్కులు తప్పడం లేదు. వర్గ పోరాటం.. పదవి కోసం పోటీ పడే నేతలు ఎక్కువగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోఅర్థం కాక ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రుగా ప్రమాణం చేయగానే ఇక ఈటల రాజేందర్ కే రాష్ట్ర అధ్యక్ష పదవి అనుకున్నారు. కానీ రాను రాను ఆయన అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆయన కోసం బీజేపీ పెద్దగా పోరాడటం లేదని కామెంట్లు చేసితనకుతాను మైనస్ చేసుకున్నారు. బయట నుంచి రావడంతో ఆయనపై నమ్మకం పెట్టుకునేందుకు బీజేపీ సిద్దపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. కానీ వారిని ఏకపక్షంగా నియమించలేరు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని వీలైనంత ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారు. ఆటలకు సీనియర్ల సపోర్టు చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బాధ్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది.ఈ నెలాఖరులో పార్టీ అధ్యక్షుడ్ని ఖరారు చేసిన తర్వాత ఆయన ఎవరు అన్నదాన్ని బట్టి బీజేపీ దూకుడు ఉండే అవకాశం ఉంది.