ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు… అండగా ఉండాలని.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు.. రైతులకు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ హామీ ఇచ్చారు. ఏపీ సర్కార్.. రాజధానిని మారుస్తూందంటూ జరిగిన ప్రచారంతో.. ఆందోళన చెందిన రైతులు.. కన్నా లక్ష్మినారాయణను ఆయన ఇంట్లో కలిశారు. తాను అందరికీ మద్దతుగా ఉంటానని.. కన్నా భరోసా ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని.. భరోసా ఇచ్చారు. రాజధానికి మద్దతుగా కన్నా మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన.. రాజధానిని ఎలా తరలిస్తారని.. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. రైతులకు ఆయన మద్దతు తెలియచేయడం… కీలక పరిణామమే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… ఓ ప్రత్యేక లక్ష్యంతో.. ఓ వర్గాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే.. రాజధానిపై.. కుట్రలు చేస్తోందని… రాజధానికి భూములు ఇచ్చిన రైతులు.. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. తాము రాజధాని కోసం.. 33వేల ఎకరాల భూములను ఇస్తే… తమ త్యాగాన్ని… బూడిదలో పోసిన పన్నీరు చందంగా చేసేందుకు.. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూండటం… తమను వేధింపులకు గురి చేయడం.. వారిని ఆవేదనకు గురి చేస్తోంది. రాజధాని మార్పు వార్తలతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు.. జగన్ దూకుడుకి..కళ్లెం వేయాలంటే.. బీజేపీనే సరైన పార్టీ అని నిర్ణయించి.. అందరూ.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వద్దకు వెళ్లారు. రైతులకు ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన కౌలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి.. ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వ తీరుపై.. కన్నా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన దూకుడుగా.. విమర్శలు చేస్తున్నారు. కొందరి కోసమే.. జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది.. తమ భావన అని… కన్నా నేరుగానే చెబుతున్నారు. కేంద్రలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. వైసీపీ.. బీజేపీ మాటలను జవదాటే పరిస్థితి లేదు. ఈక్రమంలో.. కన్నా మాత్రమే కాకుండా… జాతీయ స్థాయిలోనూ.. రాజధాని రైతులకు .. మద్దతు లభిస్తే… రాజధాని తరలింపు అనేది.. వైసీపీ సర్కార్కు సాధ్యమయ్యే పని కాదు.