భారతీయ జనతా పార్టీ – జనసేన పొత్తు అంత సీరియస్ వ్యవహారంగా లేదని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఫిబ్రవరి రెండో తేదీన లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని గతంలో ప్రకటించి వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో కనీసం ప్రకటన చేయలేదు. అప్పుడే ప్రతి పదిహేను రోజులకో సారి.. బీజేపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం అవుతుందని ప్రకటించారు. అందులో భాగంగా.. 28వ తేదీన సమావేశం ఉంటుందని.. ముందుగానే చెప్పారు. అనుకున్నట్లుగా సమావేశం జరిగింది కానీ.. వారిలో అసలు సీరియస్ నెస్ ఉందా.. అనే డౌట్ వచ్చేలా సమావేశం జరిగింది. తీసుకునే నిర్ణయాలు సంగతి సరే.. అసలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వారు.. బీజేపీ నుంచి ఎవరూ రాలేదు. పురందేశ్వరి, సోము వీర్రాజు బీజేపీ తరపున సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సహా ఎవరూ హాజరు కాలేదు. జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శివ శంకర్, చంద్రశేఖర్ హాజరయ్యారు. వైసీపీ, టీడీపీ అధికార దుర్వినియోగంపై పోరాటం చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. బీజేపీ, జనసేన ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చలు జరిపారు. అమరావతి విషయంలో.. ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని.. బీజేపీ – జనసేన చాలా ఆవేశంగా ప్రకటించాయి. కానీ అఇప్పుడు మాత్రం.. అసలైన సమంలో సైలెంటయిన సూచనలు కనిపిస్తున్నాయి.
రెండో తేదీన మార్చ్ వాయిదా వేసుకోడవమే కాదు… రాజదాని గ్రామాల్లో పర్యటిస్తానని.. మీడియాకు లీకులు ఇచ్చిన పవన్ కల్యాణ్ కూడా.. ఆగిపోయారు. అమరావతి హామీతోనే బీజేపీ పొత్తు అని చెప్పుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు.. మోడీ కోసం పొత్తు పెట్టుకున్నా.. దేశం కోసం కలిసి పని చేస్తామని చెబుతున్నారు. స్వభావానికి విరుద్ధంగా… సీఎఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై.. బీజేపీ నేతల కన్నా ఎక్కువగా ఆయనే మద్దతు ప్రకటనలు చేస్తున్నారు.