ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని వారంతా త్వరలో జైలుకెళ్లడం ఖాయమని భారతీయ జనతా పార్టీ నేత ప్రకాష్ జవదేకర్ జోస్యం చెప్పారు. విజయవాడలో ఏపీ బీజేపీ ఆధ్వర్వంలో ప్రజాగ్రహ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన ప్రకాష్ జవదేకర్.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఊహించలేదన్నారు. జాతీయస్థాయిలో నిర్మాణాత్మక పాలన సాగుతూంటే ఏపీలో మాత్రం దిశ, దిశ లేని పాలన సాగుతోందన్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మోడీ వల్లే గెలిచిదని తర్వాత దూరం జరిగి అధికారాన్ని పోగట్టుకుందన్నారు. తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగానని…, టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ అవినీతి పార్టీలేనని గుర్తించాన్నారు. హిందూత్వంపై దాడి జరుగుతోందని.. అందరూ ఖండిస్తున్నాప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు.
ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యవస్థీకృతంగా జరుగుతోందని… ప్రకాష్ జవదేకర్ పుష్ప సినిమాను ఉదాహరణగా చూపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై విచారణ కోసం నియమించిన సిట్‌ను కూడా క్యాన్సిల్ చేశారని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే సుపారిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సభలో పాల్గొన్న వారంతా ప్రభుఉత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రమేష్, సుజనాచౌదరి ప్రభుత్వం పాపం పండిందన్నట్లుగా ప్రసంగించారు.
అయితే ఒక్క సోము వీర్రాజు మాత్రమే తనదైన స్టైల్లో ప్రసంగించారు. వైసీపీపై మ..మ అనిపించే రీతిలో విమర్శలు చేశారు. కానీ టీడీపీపై ఘాటు విమర్శలు చేసారు. అమరావతి పాపం చంద్రబాబుదన్నట్లుగా కవర్ చేశారు. చంద్రబాబు అమరావతి రైతుల్ని రోడ్డున పడేశారని ..తిరుపతి వరకూ నడిపించారని విమర్శించారు. కమ్యూనిస్టులు.. కుక్కలని విమర్శించి.. తన స్పీచ్ హైలెట్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఆయనను పెద్దగా బీజేపీ సభకు హాజరైన వారే పట్టించుకోలేదు.