కొన్ని నెలల కింద నటుడు శివాజీ , కేంద్ర ప్రభుత్వం” ఆపరేషన్ గరుడ” నిర్ణయం తెర మీదకు తెచ్చాడు. మోడీ చంద్రబాబు మీద పగబట్టాడు అని కుట్రపూరితంగా కేసులు పెట్టబోతున్నాడని, చంద్రబాబుని జైలుకు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. ఇది జరిగి కొన్ని నెలలు అయింది. ఈ మధ్యకాలంలో బిజెపి అలా కేసులు పెట్టే ప్రయత్నాలు చేసినట్లు గానీ, కుట్రలు పన్నినట్టు కానీ అనిపించక పోవడం తో ప్రజలు కూడా ఆ విషయాన్ని మరిచి పోయారు. అయితే ఇప్పుడు శివాజీ మళ్లీ దీన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. దీనిపై స్పందించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.
విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, శివాజీ లేనిపోనివి కల్పించి చెబుతున్నాడని, కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికే టిడిపి ఎత్తుగడ వేసిందని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి టిడిపి సిద్ధమవుతున్న సమయంలో, ప్రజల నుంచి ఈ పొద్దు వచ్చే వ్యతిరేకతను దారి మళ్లించడానికి ఈ ఎత్తుగడ వేశారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పైగా కాంగ్రెస్-టీడీపీ పొత్తు కారణంగా పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల మీద ప్రజలు దృష్టి సారించకుండా డైవర్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఈ ఎత్తు వేశారని అన్నారు.
ఏది ఏమైనా, ఈ ఆపరేషన్ గరుడ ఉందో లేదో తెలియదు కానీ శివాజీ చూపిస్తున్న అత్యుత్సాహం మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు. అయితే ఇందులో నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి.