న్యాయవ్యవస్థను బీజేపీ.. ఆదేశించే స్థితి నుంచి బెదిరించే స్థితికి చేరుతున్నారు.
రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలకు సుప్రీంకోర్టు వక్రభాష్యం చెబుతూ కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి జొరబడుతోందని కేంద్రంలోని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బహిరంగంగానే సుప్రీంకోర్టును విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా సీనియర్ పొజిషన్లో ఉన్న రంజగన్ గోగోయ్‌ని నియమించడానికి కేంద్రం ఆడిన వీధి నాటకాలు అందరూ చూశారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. అసలు సుప్రీంకోర్టు తీర్పులే లెక్క లేదన్నట్లు మాట్లాడుతున్నారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కేరళలోని ఎల్డీఎఫ్ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామంటూ అమిత్ షా
హెచ్చరికలు కూడా చేశారు.
ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడైనందున ఆయన మాటలను కేంద్రం వైఖరిగానే పరిగణించాల్సి ఉంటుంది. కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్చేస్తామంటూ హెచ్చరించడం అంటే ఆయన ప్రభుత్వంలో భాగంగా మాట్లాడుతున్నట్లే. అలాంటి వ్యక్తి శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని మాట్లాడడం అంటే సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయక పోవడమే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు భక్తులను సమీకరిస్తుంటే వారికి మద్దతుగా అమిత్‌షా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. శబరిమలలోలాగా అయోధ్య రామమందిరం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల్లాంటి వ్యాఖ్యలను… చేశారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును బీజేపీ నేతలు విమర్శిస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు మౌనం వహిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీ న్యాయవ్యవస్థలో ఎలా జోక్యం చేసుకుంటుందో.. ఇప్పటికే.. స్పష్టమైన సూచనలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తన ఔన్నత్యాన్ని కాపాడుకోకపోతే..ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.