కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ ఎదురీది మరీ విజయం సాధించింది. ఆశలే లేవనుకున్న పరిస్థితి నుంచి సాధారణ మెజార్టీ దాకా … ఆ పార్టీ మందడుగు వేసింది. మొత్తం 224 స్థానాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మెజార్టీకి అవసరమైన 112 చోట్ల… బీజేపీ సునాయసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటో రెండో ఎక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో భాజపా ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. ఓల్డ్ మైసూర్లో జేడీఎస్ పట్టు నిలుపుకుంది. కలబురిగి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో భాజపా ఆధిక్యత చూపించింది. బెంగళూరులో తెలుగువాళ్లు వ్యతిరేకమవడంతో.. ఏప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయి.
కర్ణాటక ఫలితాలు కచ్చితంగా ఊహించనివే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ… హంగ్ అసెంబ్లీని అంచనా వేశాయి. కొన్ని మీడియా సంస్థలు బీజేపీకి ఏకపక్ష విజయాన్ని ప్రిడిక్ట్ చేశాయి. మరికొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తేల్చాయి. అయితే అన్నింటినీ క్రోడీకరిస్తే.. హంగ్ వస్తుందని..జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని తేల్చారు. కౌంటింగ్ ట్రెండ్స్‌లో కూడా మొదట అలానే కనిపించింది. కాంగ్రెస్, బీజేపీ మొదటి నుంచి హోరాహోరీ ఫలితాలొచ్చాయి. తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈవీఎంల ఓట్లన్నీ.. బీజేపీకి సపోర్ట్‌గా మారిపోయాయి. ఫలితంగా బీజేపీకి మెజార్టీ దక్కింది.
తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో.. బీజేపీకి కాస్తంత నిరాశజనకమైన ఫలితాలే వచ్చాయి. బెంగళూరు బీజేపీకి కంచుకోట. అక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువే. అందుకే ఈ సారి అక్కడ కాంగ్రెస్ కు మంచి ఫలితాలొచ్చాయి. బీజేపీతో పోటీగా కాంగ్రెస్ కూడా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.