తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పిస్తారన్న ప్రచారంపై హైకమాండ్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లి ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. అధ్యక్షుడి మార్పు ఇప్ప ట్లో ఉండదని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తెలం గాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరి నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్‌ను మార్చాలని కొంత మంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ గెలిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న వారికే సీఎం పోస్టు లభిస్తుంది. అందుకే ఆయనను తప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు.
కానీ బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ బలపడిందని మోదీ, షా నమ్ముతున్నారు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ ప్రయత్నాలకు పార్టీ పెద్దలు అడ్డుకట్ట వేయడంతోపాటు భవిష్యత్‌లో బండి సంజయ్ నేతృ త్వంలోనే పార్టీ ముందుకువెళ్తుందన్న స్పష్టత ఇచ్చారు. బండి సంజయ్ ను మారిస్తే పెద్దఎత్తున చేరికలు ఉంటాయనే సంకేతాలు పంపినా హైకమాండ్ సంజయ్ పైనే నమ్మకం పెట్టుకుంది.
కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వారం, పది రోజుల్లో వాళ్లలో కొంతమందికి జాతీయస్థాయిలో కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్‌ను విభేదిస్తున్న పలువురు నేతలతో సమావేశమైన అమిత్ షా , నడ్డా వారు చెప్పినవన్నీ ఆలకించారు. అంతిమంగా కలిసి పని చేయాలని సూచించారు. మొత్తంగా సంస్థాగత అంశాలు చర్చించామని తరుణ్ చుగ్ కూడా ప్రకటించారు. ఇక సంజయ్ ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన శక్తితో మరింత దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందుకే సంజయ్.. ఇప్పుడు.. రేపిస్టుల ఇళ్లపై బుల్డోజర్లు పంపుతానని ప్రకటించేస్తున్నారు.