రామ్‌గోపాల్ వర్మ కులాల పేరు పెట్టి.. ఓ సినిమా తీస్తున్నారు. కానీ దానికి ఎలాంటి పబ్లిసిటీ రావడం లేదు., చాలా రోజులుగా.. దానిపై పని చేస్తున్నా… వివాదాస్పద మాటలతో పాటలు విడుదల చేస్తున్నా.. తన మార్క్ లో ట్వీట్లు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఆయనో ధర్డ్ గ్రేడ్ ఫిల్మ్ మేకర్ గా… ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. కనీసం…ఓ వెబ్ సిరీస్ రేంజ్ ను కూడా.. ఆయన అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాకు క్రేజ్ తీసుకు రావడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజంగా పాజిటివ్ గా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు కాబట్టి… నెగెటివ్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. నిన్న ఒక్క సారే… అటు రాయలసీమలో.. ఇటు విజయవాడ.. చివరికి హైదరాబాద్‌లోనూ.. ఆర్టీవీ సినిమాను పబ్లిసిటీ కల్పించే చర్యలకు దిగారు.
రాయలసీమలో ప్రెస్ మీట్ పెట్టిన ఓ నేత… ఆర్టీవీ తీస్తున్న సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని.. దాన్ని నిషేధించాలని.. విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన.. విష్ణువర్ధన్ రెడ్డి అనే మరో నేత కూడా.. ఇదే తరహా డిమాండ్ చేశారు. సినిమాను నిషేధించాలన్నారు. ఆ తర్వాత రమేష్ నాయుడు అనే నేత హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. రీజినల్ సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. కథను క్షుణంగా పరిశీలించాకే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని.. టైటిల్ కూడా మార్చాలి..లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అసలు ఎవరూ పట్టించుకోని సినిమా విషయంలో బీజేపీ ఎందుకింత ప్రయాస పడుతుందోనన్న చర్చ.. సహజంగానే.. టాలీవుడ్… పొలిటికల్ సర్కిల్స్ లో ప్రారంభమయింది.
ఆర్టీవీ కొత్త సినిమా కోసం.. ఇతరులపై వెకిలి కామెంట్లు చేయడం… తాను వివాదాస్పదం అవుతుందనుకుటూ.. కొన్ని ఫోటోలు విడుదల చేయడం లాంటివి చేస్తున్నారు. గతంలో ఆయన ట్రాప్‌లో మీడియా పడిందేమో కానీ.. ఇప్పుడు.. అలాంటి పనులు చేయడం లేదు. దాంతో ఆర్జీవీ సినిమాకు.. కనీస బజ్ కూడా రావడం లేదు. దాని వల్ల ఎంతో కొంత రాజకీయ లాభం వస్తుందేమో.. అని ఆశ పడుతున్న బీజేపీ లాంటి పార్టీలకు మాత్రం.. ఇది నచ్చడం లేనట్లుగా ఉంది. ఆ సినిమాకు బజ్ తెచ్చేందుకు నెగెటివ్ ప్రచారంతో ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.