తెలంగాణలో అధికారంలోకి రావడం అనే ఆలోచన పక్కనపెట్టిన బిజెపి అద్యక్షుడు అమిత్ షా తమ మొదటి లక్ష్యం టిఆర్ఎస్ అని చెప్పారట నేతలతో. ఇక్కడ లక్ష్యం అన్నారే గాని ప్రత్యర్థి శత్రువు వంటి మాటలు వాడకపోవడం ఆసక్తికరం. మనకు వారితో పొత్తులు వుండవు గనక అన్ని చోట్లా పోటీకి సిద్ధమై పోవాలని సూచించారట. టిడిపితో కూడా పొత్తులు కొట్టేశారు. ఇలా అన్ని చోట్ల బిజెపి స్వంతంగా పోటీ పెడితే అది పరోక్షంగా టిఆర్ఎస్కు మేలు చేస్తుందనిఅమిత్షాతో సహా అందరికీ తెలుసు.బహుశా వారి మధ్య స్నేహానికి అదే సంకేతమనుకోవచ్చు. అదే సమయంలో మనం గతంలోనే చెప్పుకున్నట్టు శాసనసభ స్థానాల పెంపు వుండబోదని కూడా స్పష్టమైన సంకేతాలిచ్చేశారట.సీట్ట పెంపు క్యాబినెట్ చర్చల్లో రాలేదనీ, దానివల్ల ప్రజలకు మేలు జరిగేది లేదనిమంత్రి సుజనా చౌదరి కూడా చెప్పేశారు. గతంనుంచి ఇదే అంటున్న రాష్ట్ర అద్యక్షుడు కె.లక్ష్మణ్ ఈ సారి అనధికారికంగా ఆ సూచనలుే ధృవపరచారు. తాము కోరుకుంటున్నట్టు అధిష్టానం సీట్లపెంపు చేయొద్దని టి బిజెపి కోరుకుంటున్నది. వారు అందుకు అంగీకరించారన్న మాట. మరి సీట్లు పెరక్కపోతే ఫిరాయింపుదార్లను ఎక్కడ నిలబెడతారు అక్కడున్న తమ పాతవారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది పార్టీలకు పెద్ద పరీక్షే.