కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత.. మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత జగన్ తో విబేధించి టీడీపీలో చేరారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో ఆయన కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. చిరకాల ఫ్యాక్షన్ ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో అవగాహనకు వచ్చినా .. అటు జమ్మలమడుగులోనూ విజయం దక్కలేదు. ఫలితాల తర్వాత… రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి పెరిగిపోయింది. కనీసం వర్గాన్ని రక్షించుకోవడానికైనా ఆయన బీజేపీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.
మరో వైపు… ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు.. హైదరాబాద్ లో అత్యంత రహస్య సమావేశాలు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం ఓ కీలక నేత ఇంట్లో జరిగిన సమావేశానికి రామ్మాధవ్ హాజరైనట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన విధానం… మూడు నెలల్లోనే..ఏపీ సర్కార్ తీరుపై.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను.. ఎలా అనుకూలంగా మార్చుకోవాలన్న అంశంపై చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. పార్టీలో చేరికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా.. రామ్మాధవ్… పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారంటున్నారు.
రామ్మాధవ్ చెప్పిన అంశాలతో.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇంట్లో… శ. మరో సారి కీలక నేతలు సమావేశమయ్యారు. గచ్చిబౌలిలో ఉన్న కన్నా లక్ష్మినారాయణ ఇంట్లో.. ఈ రహస్య సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. హాజరైన సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, పురంధేశ్వరి… మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తితో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానికి వచ్చారు. కొద్ది రోజలుగా.. ఏపీలో వైసీపీ సర్కార్.. బీజేపీ నేతలను టార్గెట్ చేసిందని… వీరు నమ్ముతున్నారు. ముఖ్యంగా… బీజేపీని విమర్శించడానికి .. టీడీపీ నుంచి చేరిన వారిని.. టార్గెట్ చేసి.. నేరుగా.. బీజేపీపై ఎటాక్ చేస్తున్నట్లుగా… వైసీపీ నేతలు వ్యవహరించడాన్ని.. సమావేశంలో పాల్గొన్న నేతలు … చర్చించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఏపీలో ఓ భారీ ప్రణాళికను అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.