బిగ్ బాస్ సీజన్ 5 లో తాజా ఎపిసోడ్ లో యాంకర్ రవి ని ఎలిమినేట్ చేయడం చర్చకు దారి తీసింది. యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నిరసన తెలపడం, బిజెపి ఎమ్మెల్యే ఈ సమస్యపై స్పందించడం మరింత చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. మొదటి నుండి టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ భావించిన రవి, మూడు వారాల ముందుగా ఎలిమినేట్ కావడం ప్రేక్షకుల ని కూడా షాక్ కి గురి చేసింది. ప్రియాంక , సిరి , కాజల్ ల కంటే రవికి ఉన్న ఓటింగ్ చాలా ఎక్కువ అని అనధికార ఓటమి వెబ్సైట్స్ చెబుతున్నాయి. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ కూడా వీరు ముగ్గురు తో పోలిస్తే రవికి ఎక్కువే అయినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే ఎలిమినేట్ చేశారు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత సీజన్లో కుమార్ సాయి ని కూడా ఇదే విధంగా ఎలిమినేట్ చేశారన్న విమర్శలు వచ్చాయి.
ఈ విషయం లో యాంకర్ రవి కి మద్దతు గా వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ . ఉద్దేశపూర్వకంగానే నిర్వాహకులు యాంకర్ రవి ని ఎలిమినేట్ చేశారన్న ఆయన, అసలు బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు. మరొక వైపు రవి అభిమానులు తెలంగాణకు చెందిన రవి ని కావాలనే తప్పించారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు విశ్లేషకులు మాత్రం నిర్వాహకులు కావాలనే రవి ని తప్పించారని, టాప్ 5 లో కనీసం ఇద్దరు అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేయడం కోసం, మరియు శ్రీ రామ్ చంద్ర కి మేలు చేయడం కోసం నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రవి ని ఎలిమినేట్ చేశారని విశ్లేషిస్తున్నారు. ఇంకొందరు మాత్రం రవికి మిగతా వారితో పోలిస్తే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, ఇప్పటికే దాదాపు కోటి రూపాయల దాకా పారితోషికం రవికి అందిందని, బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఆడియెన్స్ ఓటింగ్ తోపాటు బడ్జెటింగ్ సంబంధిత కారణాలు కూడా ఉంటాయి అని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.
ఈ వివాదం మొత్తం పై యాంకర్ రవి కూడా స్పందించారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేక పోయినప్పటికీ ప్రేక్షకుల స్పందన చూస్తూ ఉంటే తాను గెలిచినట్లు భావిస్తున్నానని అంటూ రవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.